ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

ఇవాళ దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. యూఎస్‌ ఫెడ్‌ మినిట్స్‌ వివరాలు ఇవాళ వెల్లడికానుండటం, జపాన్‌ ఎక్స్‌పోర్ట్‌ డేటా నిరుత్సాహకరంగా ఉండటంతో దేశీయ మార్కెట్లు వేచిచూసే ధోరణిలో ట్రేడవుతోన్నాయి. రేపు వీక్లీ క్లోజింగ్‌ ఉండటంతో బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. క్రూడాయిల్‌ ధర స్వల్పంగా పెరిగడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లోని మిగతా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 77 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో ట్రేడవుతోన్నాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, టైటాన్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉండగా, యూపీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐలు నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

  Market opens : Sensex is up 60.88 points or 0.16 percent at 39105.23, and the Nifty gained 18.10 points or 0.16 percent at 11539.90. Mahindra & Mahindra, Bajaj Auto, Titan Company, Tata Motors and Bharti Airtel are the top gainers while Reliance Industries, Aurobindo Pharma and IndusInd Bank are the most active stocks.  Among the sectors, auto along with the pharma index added half a percent each while the midcap and small indices are also trading in the green.