వీరి రూటే సెపరేటు... కొనుగోలులో ట్రెండ్ మార్చిన మ్యుచువల్ ఫండ్స్

వీరి రూటే సెపరేటు... కొనుగోలులో ట్రెండ్ మార్చిన మ్యుచువల్ ఫండ్స్

మ్యుచువల్ ఫండ్స్  మేనేజర్స్ లార్జ్ క్యాప్ కే ఎక్కువగా ఆసక్తిచూపుతారు. అందుకు తగ్గట్టే లాభాలు కూడా ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఆగస్టులో కొన్ని స్మాల్, మిడ్ క్యాప్ లో కూడా ఇన్వెస్ట్ చేశాయి. రిలయన్స్ ను కూడా కాదని.. కొన్ని మిడ్, స్మాల్ పై విశ్వాసం ప్రకటించాయి. అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కంపెనీల పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలు, లిక్విడిటీ, కోవిడ్ నిర్వహణలో మేనేజ్ మెంట్ నిర్ణయాలు పరిశీలించిన తర్వాత ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు ఫండ్ మేనేజర్లు.  

ఫండ్ మేనేజర్స్ నమ్మకం పెట్టినవాటిలో కొన్ని..
UTI MF కెన్సాయి నెరోలాక్ పెయింట్స్ ను ఎక్కువగా కొనుగోలుచేసింది. రూ.27వేల 860 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీకి మంచి ఫ్యూచర్ ఉందని భావిస్తోంది. మార్కెట్లో 60శాతం వాటాతో పాటు. త్వరలో కొత్త విభాగాల్లో కూడా ప్రవేశించనుంది. ఆటోమొబైల్, రోడ్స్, కన్జూమర్ విభాగాల్లోనూ రంగుల వ్యాపారంలో అడుగుపెడుతోంది. స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ చూస్తుంటే 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి షేరుపై కనీసం 30శాతం ప్రాఫిట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఫండ్ మేనేజర్లు. 
  
అశోక్ లేలాండ్ పై HDFC MF నమ్మకం పెట్టింది. మార్కెట్ వాల్యూ రూ.22,853 కోట్లు. కంపెనీ తన ఉత్పత్తులను పెంచుతోంది. మార్కెట్లో 65శాతం అవసరాలు తీర్చేవిధంగా కొత్తట్రాన్స్ పోర్టు వాహనాలతో వస్తోంది కంపెనీ. కమర్శియల్ వాహనాల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అంతేకాదు కోవిడ్ తో పాటు.. దీర్ఘకాలిక ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకుని కాస్ట్ కటింగ్ చేస్తోంది. ఇందులో చాలావరకు సక్సెస్ అయింది. దీంతో కంపెనీ మార్జిన్స్ మెరుగ్గా ఉన్నాయి. 2022లో కంపెనీ షేరు కనీసం 10శాతం వరకూ లాభపడుతుందని అంచనా.

కోటక్ MF అటు గోద్రేజ్ ప్రాపర్టీస్ పై ఫోకస్ చేసింది. రూ.22,595 కోట్ల మార్కెట్ వాల్యూ కలిగి ఉంది. దేశంలో టాప్ 4 రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటి. ముంబై, బెంగళూరు, ఢిల్లీలో రియాల్టీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. కోవిడ్ తర్వాత మళ్లీ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కంపెనీ ఖచ్చితంగా లాభపడతుంది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ భాగుంది. కంపెనీకి ఉన్న ముందుచూపు, నిర్వహణతీరు ఆకట్టుకుంటోంది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ షేరు కనీసం 22శాతం లాభపడుతుందని అంచనా.

HDFC MF  కన్నేసిన మరో స్మాల్ క్యాప్ కంపెనీ  టీమ్ లీజ్. కేవలం రూ.4040 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోంది. 1900 మంది ఉద్యోగులు, 2500 మంది క్లెయింట్స్ ఉన్న కంపెనీ క్రమంగా విస్తరిస్తోంది. వన్ స్టాప్ హ్యూమన్ రీసోర్స్ కంపెనీగా స్టాఫింగ్, పేరోల్స్, రిక్రూట్మెంట్లు, ట్రైనింగ్ సర్వీసులు అందిస్తోంది. ఈ విభాగంలో దేశ మార్కెట్ వాల్యూ 2025 నాటికి 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. టీమ్ లీజ్ కు మంచి అవకాశాలున్నాయి. ఖచ్చితంగా కంపెనీ దీనిని అందిపుచ్చుకుంటుంది. సో రానున్న స్మాల్ క్యాప్అయినా ఫండ్ మేనేజర్లు దీనిపై ద్రుష్టిసారించారు.