ఈ ఏడాది కూడా LICకి చెందిన IPO లేనట్టే

ఈ ఏడాది కూడా  LICకి చెందిన IPO లేనట్టే

ఈ ఏడాది కూడా  LICకి చెందిన IPO లేనట్టే
ప్రక్రియలో కొనసాగుతున్న జాప్యం
వచ్చే ఏడాదికి వాయిదా?
అసెట్ నిర్వహణ కంపెనీల నియామకంలో ఆలస్యం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న LIC కంపెనీ IPO మళ్లీ వాయిదా పడుతోంది. గతంలో ఎన్నుడూ లేని విధంగా అతిపెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్  కు సిద్దమవుతోంది LIC. అయితే ఇంకా ప్రాధమిక దశలోనే ఉండటంతో ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దాదాపు ఈ సంవత్సరం లేనట్టేనని తెలుస్తోంది. ప్రభుత్వం ఇంకా ప్రక్రియ చేయడానికి అవసరమైన అసెట్ వాల్యూయర్ ను నియమించలేదు. ఇదే అత్యంత కీలకం. ఇక్కడే ఇంకా బాలారిష్టాలు దాటడంలేదు.  ఒకవేళ ఇప్పటికిప్పుడు నియమించినా ప్రక్రియ పూర్తిచేయడానికి 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి.. 2020లో కాకుండా 2021 ఆర్ధిక సంవత్సరంలోనే IPOకు వస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ది డిపార్ట్ మెంట్ ఆఫ్  పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్  దీనికి సంబంధించి బిడ్లు జూన్ లోనే ఆహ్వానించింది. ఇంతవరకూ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. రెండు కంపెనీలకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది ప్రభుత్వం.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా 2లక్షల 10వేల కోట్లు సమీకరిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. కానీ ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారుతున్నాయి. కోవిడ్ కారణంగా తీసుకున్ననిర్ణయాలన్నీ వాయిదా వేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, BPCL వాటాల విక్రయం కూడా రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు కీలకమైన LIC  ఐపీఓ పరిస్థితి కూడా ఇదే.tv5awards