ఇండియాలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ ?

ఇండియాలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ ?

ఇండియాలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ ?
త్వరలో కేబినెట్ ఆమోదం
పార్లమెంటుకు రానున్న బిల్లు

క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సరికొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్ట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కేబినెట్ లో చర్చించి.. బిల్లుగా పార్లమెంటుగా పెడతారని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. వాస్తవానికి 2018లోనే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా క్రిప్టో ద్వారాజరిగే లావాదేవీలను బ్యాన్ చేసింది. వరుసగా వెలుగుచూసిన స్కాములనేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డి మానిటైజేషన్ సమయంలో దీనిపై కూడా పెద్ద చర్చ జరిగింది. అయితే కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. వాటికి అనుకూలంగా మార్చి 2020లో తీర్పు వచ్చింది. తీర్పు అనుకూలంగా రావడంతో మార్కెట్లో భారీగా ట్రేడింగ్ పెరిగింది. రెండు నెలల్లోనే దాదాపు 450శాతం పెరిగింది. మార్చిలో ఏకంగా 400శాతం, ఏప్రిల్ లో 270శాతం బిట్ కాయిన్ ట్రేడింగ్ నడిచినట్టు తెలుస్తోంది.

బిట్ కాయిన్ పై భిన్నవాదనలు
ఇండియ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. ఏసియా దేశాల్లో వీటిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 2017లో చైనా దీనిని బ్యాన్ చేసింది. అయితే అయితే ఇటీవల కాలంలో వర్చువల్ ప్రాపర్టీ ట్రేడింగ్ విభాగంలో అనుమతి ఇచ్చింది. అయితే దీనిని ఫియట్ మనీగా గుర్తించరు. సింగపూర్, సౌత్ కొరియాలు కూడా వీటిని డిజిటల్ కరెన్సీగా గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నాయి.  ఇండియాలో కూడా బ్యాన్ చేయడం కంటే నియంత్రణ చర్యలు తీసుకుని.. పరిమితులకు లోబడి అనుమతించడం మేలని అంటున్నారు కొందరు. అయితే మోసాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిని నిషేదించడమే మంచిదని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులో ఏముంటుందో చూడాలి.