21న IPO కి కెమ్ కాన్ స్పెషాలిటీ కెమికల్స్

21న IPO కి కెమ్ కాన్ స్పెషాలిటీ కెమికల్స్

కెమ్ కాన్ స్పెషాలిటీ కెమికల్స్ సెప్టెంబర్ 21న దలాల్ స్ట్రీట్ లో ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPO కు వస్తోంది. ఇప్పటికే  మార్కెట్ రెగ్యులేటరీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  దీని ద్వారా సుమారు 350 నుంచి 400 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ప్రమోటర్స్ అయిన రాజేంద్ర అగర్వాల్, నరేష్ విజయ్ కుమార్ అగర్వాల్  ఇద్దరూ తమకున్న షేర్లలో 22.5లక్షల చొప్పున విక్రయించనున్నారు.

ఇవి కూడా IPO ద్వారానే. కంపెనీ దేశీయంగా ఉత్పత్తులను అందించడమేకాకుండా.. అమెరికా, జపాన్, చైనా, సౌదీ, రష్యా, మలేసియా సహా పలు దేశాలను ఎగుమతులు చేస్తోంది. కంపెనీకి కీలకమైన కస్టమర్లున్నారు. హెటిరో, లారస్, అరబిందో, సంజయ్ కెమికల్స్, వివిన్ డ్రగ్స్  వంటి పెద్ద కంపెనీలకు తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ HMDS మరియు వంటి ఫార్మాలో ఉపయోగించే ముడడిపదార్ధాలు ఉత్పత్తి చేస్తోంది.