బుధవారం ట్రేడింగ్ సానుకూలంగా ఉంటుందా?

బుధవారం ట్రేడింగ్ సానుకూలంగా ఉంటుందా?

ఓవరాల్ గా చూస్తే బుధవారం కూడా దేశీయ మార్కెట్లు లాభాలు స్వీకరించే అవకాశం ఉంది. నిఫ్టీ 11, 600 మార్కును అందుకుంటుందని నిపుణులు అంటున్నారు. మార్కెట్ కు ప్రతికూల పరిస్థితులు కూడా పెద్దగా కనిపించడం లేదు.  

అంతకుముందు మనం చెప్పుకున్నట్టు US మార్కెట్లలు పాజిటివ్ ట్రేడింగ్ తో ముగియుడంతో మంగళవారం కూడా  దేశీయ స్టాక్స్ లో ర్యాలీ కనిపించింది. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ ర్యాలీతో మార్కెట్ మంగళవారం హైలో ముగిసింది. సెన్సెక్స్  287 పాయింట్లు లాభపడి 39,044 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 81.80పాయింట్లు లాభపడి 11,521 మార్కును దాటింది.

అమెరికా ఫెడ్ వరుస సమావేశాలు అనంతరం వివరాలు ఇవాళ వెల్లడించే అవకాశం ఉంది. దీని ప్రభావం మార్కెట్లపై ఉంటుంది. అటు ఫ్యాక్టరీ డేటా కూడా సానుకూలంగా ఉండటంతో స్వల్పంగా ర్యాలీ కనిపించింది. డోజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 125.47 పాయింట్లు లాభపడింది. 0.45శాతం పెరిగి 28,118 వద్ద ముగిసింది., అటు S&P500 కూడా 23.72 పాయింట్లు లాభపడింది. 3407 వద్ద ముగిసింది. నాస్ డాక్ కంపోజిట్ 133.67 పాయింట్లు లాభపడింది. 11,244.46 వద్ద ముగిసింది. 
అటు ఏసియన్ మార్కెట్లు మిక్స్డ్ గా ఉన్నారు ఉన్నాయి. నిక్కీ225 28 పాయింట్లు లాభపడింది. హెంగ్ సెంగ్ కూడా 16 పాయింట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. తైవాన్, కోస్పీ లాభాల్లో కొనసాగుతున్నాయి.