దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ రైట్స్‌ ఇష్యూ

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ రైట్స్‌ ఇష్యూ

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ కార్పొరేషన్‌ రైట్స్‌ ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.133గా ఖరారు చేసింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.180 కోట్ల సమీకరణకు కంపెనీ ఈ ఏడాది మే నెలలో నిర్ణయం తీసుకుంది. బోర్డు ఆమోదం తెలిపింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరు రైట్స్‌ ఇష్యూ ధరగా రూ.133ను సమీకరిస్తున్నట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.

సెప్టెంబర్‌17ను రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది. ఆ తేదీ నాటికి కంపెనీ వాటాలన్న వారు రైట్స్‌ ఇష్యూకు అర్హులు. ప్రతీ 20 షేర్లకు మూడు షేర్ల చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చు.