డీటీహెచ్ కంపెనీలకు కాసుల వర్షం

డీటీహెచ్ కంపెనీలకు కాసుల వర్షం

డీటీహెచ్ కంపెనీలకు కాసుల వర్షం
6శాతం పెరిగే అవకాశం 
రూ.22వేల కోట్ల ఆదాయం

కరోనా వైరస్‌, ఫిజికల్ డిస్టెన్స్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. అటు అన్ లాక్ 4 కూడా అమల్లోకి వచ్చినా థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో OTT, ATT, డిష్ టీవీలకు డిమాండ్ ఫుల్ గా పెరిగింది. డిష్ టీవీ ఆదాయం అయితే ఏకంగా 6శాతం పెరిగినట్టు చెబుతున్నారు. మొత్త ఆదాయం 22వేల కోట్లకు చేరుతుందని అంచనా. దీనికి సంబంధించిన ఇటీవలే క్రిసిల్ ఓ నివేదిక విడుదల చేసింది. దేశంలో మొత్తం టీవీ సబ్‌స్క్రయిబర్స్‌లో డీటీహెచ్‌ వాటా 37 శాతం దాకా ఉంది.  2020 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం గ్రోత్ ఉంది. 9 శాతం వాటా.. యూజర్ల సంఖ్య పెరగడం వల్లే వచ్చింది. ఇక యూజర్స్ ఛానల్స్ పెంచుకోవడం ద్వారా మరో 5 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో యూజర్ల సంఖ్య మరో 6–7 శాతం పెరిగి 6.8 కోట్లకు చేరవచ్చని, దీంతో 4–6 శాతం మేర ఆదాయం పెరుగుతుందని అంచనా. తాజాగా వచ్చిన క్రిసల్ రేటింట్ కారణంగా డిటిహెచ్ సేవలు అందిస్తున్న కంపెనీల షేర్లు కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. dth