గాయత్రి ప్రాజెక్ట్స్‌కు కొత్త కాంట్రాక్టు

గాయత్రి ప్రాజెక్ట్స్‌కు కొత్త కాంట్రాక్టు

ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాంట్రాక్టును దక్కించుకున్నట్టు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు గాయత్రి ప్రాజెక్ట్స్‌ సమాచారమిచ్చింది. యూపీలోని లలిత్‌పూర్‌ జిల్లాలో కచొండ కలాన్ గ్రూప్‌ ఆఫ్‌ విలేజెస్‌కు సంబంధించి నీటి సరఫరా పథకం ప్రాజెక్ట్‌కు తాము L-1 బిల్డర్‌గా నిలిచినట్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ విలువ రూ.196 కోట్లు. వచ్చే పదేళ్ళపాటు కమిషనింగ్‌, ఆపరేటింగ్‌, మెయింటనెన్స్‌ను తాము చేపట్టనున్నట్టు వెల్లడించింది. 

కొత్త ఆర్డర్‌ రాకతో ఇవాళ గాయత్రి ప్రాజెక్ట్స్‌ జోరుమీదుంది. ఇవాళ ఇంట్రాడేలో 5శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.17.9కు చేరింది. ప్రస్తుతం 3 శాతం పైగా లాభంతో రూ.17.70 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.