భారత్ మార్కెట్ వీడం.. అలాగని విస్తరించం

భారత్ మార్కెట్ వీడం.. అలాగని విస్తరించం

భారత్ మార్కెట్ వీడం.. అలాగని విస్తరించం
తేల్చి చెబుతున్న టాయోటా కంపెనీ
కార్లపై అధిక పన్నులే కారణం
మేకిన్ ఇన్ ఇండియాకు ఎదురుదెబ్బ
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

ఎవరినైనా మార్కెట్ వరకూ తీసుకరాగలం.. కానీ కొనాలా వద్దా అన్నది కస్టమర్ ఛాయిస్. వాళ్లంతట వాళ్లే నిర్ణయించుకోవాలి. దేనికైనా ఇదే వర్తిస్తుంది. కొనగలిగే శక్తి ఆయనకు ఉందా? మనం ఇవ్వగలమా? ఇది కూడా కీలకం.  మనం షాపు పెట్టడానికి ముందు మార్కెట్ స్రుష్టించాలి. ఇందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఇండియాలో ఇదే మిస్ అవుతుందని కార్ల కంపెనీలు అంటున్నాయి. మమ్మల్నిపెట్టుబడులు పెట్టమంటారు.. కానీ మార్కెట్ మాత్రం రెడీగా లేదు.. ఎలా అంటున్నాయి ఆటో కంపెనీలు.  

ఏంజరిగింది..?
ఇండియా వచ్చి పరిశ్రమ పెడితే కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తామంటోంది కేంద్రం. ఆటో రంగంలో 28బిలియన్ డాలర్ల రాయితీలు సిద్దమని అంటోంది. కానీ ఉత్పత్తి చేసి పెట్టినా కొనేవారుండాలిగా అంటున్నాయి కంపెనీలు. రాయితీలు కాదు.. అమ్మకాలు ఉంటే కంపెనీ బతుకుతుంది లేదంటే నష్టాలే.  ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. భారతీయ పన్నుల విధానం వల్ల కార్ల ఉత్పత్తి చేసినా కొనేవారులేరు. ఇండియాలో ఇక పెట్టుబడులు పెట్టేది లేదని స్పష్టం చేసింది టయోటా. ఇన్నోవా, ఫార్చునర్ కార్లను ఉత్పత్తి చేస్తున్న టయోటా.. ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో కార్ల కంపెనీ. జపాన్ కు చెందిన ఈ సంస్థ ఇక మీదట ఇండియాలో విస్తరణ ప్రణాళికలపై వెనక్కు తగ్గుతున్నట్టు చెబుతోంది. అయితే మార్కెట్లో మాత్రం ప్రస్తుతం కొనసాగుతామంటోంది. 

పన్నులు అంత ఎక్కువున్నాయా?
ఇండియాలో కార్లు, 2 వీలర్స్ పై అధికంగా పన్నులున్నాయి. SUVలపై ఇంకా అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం 28శాతం GST ఉంది. దీనికి తోడు కారు సైజు, విభాగం. ఇంజిన్ సైజు, పొడుగు, లగ్జరీ ఇలా రకరకాల పేరుగా 1శాతం నుంచి 22శాతం అదనపు పన్నులు పడుతున్నాయి.1500 సీసీ ఇంజిన్ తో పాటు.. నాలుగుమీటర్ల పొడువు దాటిన SUVలపై దాదాపు 50శాతం వరకూ పన్నులు పడుతున్నాయని కంపెనీలు అంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. ప్రత్యేకంగా టయోటా కార్లపై 43శాతం వరకూ పన్నులు ఉన్నాయట. 

టాయోటా వాదన...
పన్నుల విధానం విదేశీ పెట్టుబడులకు ఆటంకంగా మారాయని నిపుణులు అంటున్నారు. తమ మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. అమ్మకాలు ఉండటం లేదు. దీంతో కొత్త మోడల్స్ తీసుకరావడం కంపెనీలకు సవాలుగా మారింది. దాదాపు కొత్త ఉత్పత్తులపై అప్రకటిత నిషేధం ఉందని టాయోట కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం విధానాలతో తాము ఇండియాలో కొత్తగా పెట్టుబడులకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ నుంచి తప్పుకోవడం లేదని.. కొనసాగిస్తామని చెబుతోంది. టయోటా 1997లో ఇండియా మార్కెట్లోకి వచ్చింది. దీనికి ఇండియాలో స్మాల్ మార్కెట్ ఉంది. ఆగస్టులో కంపెనీ మార్కెట్ వాటా కేవలం 2.6శాతం మాత్రమే. అయితే SUV విభాగంలోనే అత్యధికంగా సేల్స్ ఉన్నాయి. కాబట్టి ట్యాక్స్ విధానం కంపెనీపై తీవ్రంగా పడుతోంది. 

ఫోర్డ్, జీఎం అవుట్...
టాయోటా ప్రకటన చూస్తుంటే రానున్న కొన్నేళ్లలో మార్కెట్ నుంచి తప్పుకున్నా  ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగొ మార్కెట్ అయిన భారత్ లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏ కంపెనీ అయినా చూస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా కంపెనీలు వరుసగా తిరుగుటపా కడుతున్నాయి. 2017లో అమెరికాకు చెందిన  జనరల్ మోటర్స్ మార్కెట్ నుంచి వైదొలిగింది. ఇక ఫోర్డ్ కంపెనీ కూడా విస్తరణ ప్రణాళికలు అపేసి.. ఇండియాలో అసెట్స్ మొత్తం మహీంద్రా కంపెనీలో జాయింట్ వెంచర్ గా మార్చింది. ఇక చాలా కంపెనీలు మార్కెట్లో తట్టుకోవడానికి జేవీలుగా మారుతున్నాయి. స్కోడా, ఫోక్స్ వ్యాగన్ కంపెనీలు ఉమ్మడి ప్రణాళికలతో వస్తున్నాయి. టాయోటా కూడా మారుతీతో జతకట్టింది. మొత్తానికి ఆటోరంగం ట్యాక్సులపై గరంగరంగా ఉంది. 

EV ఛాలెంజ్
కోవిడ్ కంటే ముందే ఆటో రంగంలో తీవ్ర సంక్షోభం ఉంది. లక్షలమంది జాబ్స్ పోయాయి. ప్రస్తుతం మార్కెట్ యథాతధస్థతికి చేరుకోవడానికి నాలుగేళ్లు పడుతుందని అంచనా. మారుతీ, హుండాయ్ కంపెనీలు ఎపర్డబుల్ కార్లతో మార్కెట్లో 70శాతానికి పైగా వాటాతో మెరుగ్గానే ఉన్నాయి. కానీ మిగిలిన కంపెనీ పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. ఇది కూడా ఎంతోకాలం ఉండదని.. ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకరావడం సాధ్యంకాదని కంపెనీలంటున్నాయి. ఇండియా ఇంపోర్ట్ డ్యూటీ కారణంగా అసలు తమ కార్ల ఎఫర్డబుల్ కాదని టెస్లా విద్యుత్ కార్ల కంపెనీ చెప్పింది. పన్నులు తగ్గించేవరకూ ఇండియాలో రాలేమని ఎలన్ మస్క్ ప్రకటించారు. 

ఆటోరంగంలో సమస్యలపై కేంద్రం ద్రుష్టిసారించిందని..GST విషయంలో పునరాలోచన చేస్తుందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటన అయితే చేశారు. ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొన్న జరిగిన GSTకౌన్సిల్ లో కూడా ఈ చర్చ జరగలేదు. మేకిన్ ఇండియా భాగంగా కంపెనీలను ఆహ్వానించడం కాదు.. ముందుగా మార్కెట్ కూడా ఉండాలి. ప్రభుత్వం ముందుగా మార్కెట్ ను రెడీ చేసి అడిగితే కంపెనీలు వేల కోట్లు తీసుకొచ్చిపెడతాయి. కస్టమర్ లేనప్పుడు వచ్చి ఎలాంటి ప్రయోజనం ఉండదని  అంటున్నాయి కంపెనీలు.