ఈ వారం... షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం ఈ స్టాక్స్ ట్రై చేయవచ్చు

ఈ వారం... షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం ఈ స్టాక్స్ ట్రై చేయవచ్చు

షార్ట్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ ట్రై చేయవచ్చు

గడిచిన వారంలో మార్కెట్ నిస్తేజంగానే ఉంది. ఒకటి రెండు రోజులు తప్పిదే.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడున్న హర్డిల్స్ దాటితే మార్కెట్ ఈ వారం 11,550-11,650 మధ్యకు వస్తుంది. డౌన్ సైడ్ అయితే మాత్రం 11,350-11,200 వరకూ వస్తుంది. గడిచినవారం రిలయన్స్ కాపాడింది. ఐటీ స్టాక్స్ కూడా కాస్త ఫర్వాలేదనిపించాయి. బ్యాంకింగ్ పూర్తిగా నిరాశపరిచాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ సపోర్టు దొరికితే 22,200-22000 మధ్య ఉండొచ్చు. హోల్డ్ దొరక్కపోతే మాత్రం నిఫ్టీ 11,200కు పడిపోతుంది. మార్కెట్ ఎలా ఉన్నా ఈ షేర్లు ప్రయత్నించింది.. వారంరోజుల్లో మీకు బెటర్ ప్రాఫిట్స్ చాన్సుంది. ఇందులో

అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రస్తుతం 340 వద్ద ట్రేడ్ అవుతుంది. 360 టార్గెట్ పెట్టుకోవచ్చు. స్టాప్ మాత్రం 332. గత కొద్దివారాలుగా స్టాక్ కరెక్షన్ అవుతుంది. రానున్న కొద్దిరోజులు కూడా రికవరీ ఛాన్సుంది.

విప్రో ప్రస్తుతం 292 వద్ద ట్రేడ్ అవుతుంది. టార్టెట్ ప్రైస్ 310. స్టాప్ 282. ఐటీ సెక్టార్ గతవారం కూడా బెటల్ గా పెర్ఫ్ఫామ్ చేశాయి.  గురువారం వరకూ స్టాక్ సానుకూలంగా లేకపోయినా శుక్రవారం అనూహ్యంగా పెరిగింది. రానున్న కొద్దిరోజులు స్టాక్ పాజిటివ్ ట్రేడ్ కనిపిస్తుంది అంచనా. 

పీవీఆర్ ప్రస్తుతం 1257 వద్ద ట్రేడ్ అవుతుంది. టార్టెట్ 1220. స్టాప్ 1290. మార్చి ఉత్పాతం నుంచి స్లోగా రికవరీ అవుతుంది. కొద్ది నెలలుగా నిలకడగా రాణిస్తుంది. షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అయితే ఈ స్టాక్ మళ్లీ ఆగిపోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయండి.