మల్టీలార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారా.. మీకోసమే చదవండి

మల్టీలార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారా.. మీకోసమే చదవండి

మల్టీలార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారా.. మీకోసమే చదవండి
సెబీ సరికొత్త మార్గదర్శకాలు
జనవరి 2021 నుంచి అమల్లోకి న్యూ రూల్స్
స్మాల్ & మిడ్ లోకి దాదాపు రూ.40వేల కోట్లు

ఇటీవల కాలంలో సెబీ ఫుల్ యాక్టీవ్ అయింది. మార్కెట్లో మోసాలను అరికట్టడంతో పాటు.. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్తకొత్త నిబంధనలు విధిస్తోంది. ఆంక్షలు కఠనతరం చేస్తోంది. మార్జిన్ ట్రేడింగ్ నిబంధనలు పూర్తిగా మార్చింది. ఇప్పుడు మ్యుచువల్ ఫండ్స్ లోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 
సెబీ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా మల్టీ క్యాప్ ఫండ్ నుంచి ఇక మీదట ఖచ్చితంగా లార్జ్, మిడ్, స్మాల్ ఫండ్స్ లో 25శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడున్న 65శాతం పరిమితిలో అత్యధికంగా ఒకే మల్టీ క్యాప్ లో పెట్టడానికి వీల్లేదు. 75శాతం తప్పనిసరి చేశారు. గతంలో ఇది కేవలం 65శాతం మాత్రమే ఉండేది. అది కూడా ఫండ్ మేనేజర్, ఇన్వెస్టర్ చాయిస్. తాజా నిబంధనలతో ప్రస్తుతం ఉన్న మల్టీ క్యాప్ ఫండ్ మొత్తం పునర్వవ్యవస్థీకరించాల్సి ఉంటుంది. జనవరి 2021 నుంచి అమల్లోకి వస్తాయి. 

ఫండ్ డేటా బేస్ చూస్తే...
లక్షా40వేల కోట్లు మల్టీ క్యాప్ ఫండ్ మార్కెట్ ఉన్నట్టు అంచనా. ఇది ఆగస్టు 2020 నాటి లెక్క. ఇందులో మెజార్టీ ఫండ్స్ లార్జ్ క్యాప్ లోనే ఉన్నాయి. 35 మల్టీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో 32 వరకూ  తమ ఫండ్స్ లో  50శాతానికి పైగా లార్జ్ లోనే పెట్టాయి. 28 స్కీములు అయితే ఏకంగా 65 నుంచి 92శాతం వరకూ లార్జ్ మల్టీ క్యాప్ లోనే ఉన్నాయని అంచనా. 10శాతం లోపు మాత్రమే స్మాల్ క్యాప్ లో పెట్టాయి. మార్నింగ్ స్టార్ ఏజెన్సీ నివేదిక ప్రకారం దాదాపు రూ.40వేల కోట్లు ఇప్పుడు లార్జ్ నుంచి మిడ్ అండ్ స్మాల్ మల్టీ క్యాప్ కు మళ్లించాల్సి ఉంటుంది. ఇందులో మిడ్ క్యాప్ కు రూ.13వేల కోట్లు మరియు స్మాల్ మల్టీ క్యాప్ కు రూ.27వేల కోట్లు రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుందని అంచనా.

గుడ్ అండ్ బ్యాడ్...
సెబీ తాజా నిర్ణయంతో మల్టీ క్యాప్ ఫండ్స్ కు ఇన్వెస్టర్లు దూరమయ్యే అవకాశముందని చెబుతున్నారు కొందరు ఫండ్ మేనేజర్లు. స్మాల్, మిడ్ క్యాప్ లపై పెట్టాలని తమకు ఉంటుందని.. కానీ కస్టమర్ల ఛాయిస్ కూడా తాము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. డిమాండ్ కు అనుగుణంగానే ఫండ్స్ సహజంగానే లార్జ్ క్యాప్ వైపు వెళతాయంటున్నారు. అంతేకాదు.. తాజా నిర్ణయం కారణంగా అంతర్జాతీయ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి కార్పస్ గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. 25శాతం మాత్రమే పోర్ట్ పోలియోకు ఛాన్సుంటుంది. ఓవరాల్ గా కూడా మార్కెట్ లో నెగిటీవ్ ట్రేడింగ్ కు ఆస్కారం ఉంటుందన్నది ట్రేడ్ వర్గాల్లో కొందరి వాదన.  2017లో కూడా కేటగిరీలుగా విభజించిన సమయంలోనూ ఇలాంటి అనుభవాలు గుర్తుచేస్తున్నారు. మల్టీ లార్జ్ క్యాప్ ఫండ్ నుంచి డైవర్ట్ చేయడం వల్ల మార్కెట్లో కరెక్షన్ చాన్సు ఉందంటున్నారు. స్మాల్ క్యాప్ లో షార్ట్ ర్యాలీ అవకాశం ఉంది కానీ.. ఎంతవరకూ మర్కెట్ ను సస్టేయిన్ చేయగలదన్నది చూడాలంటున్నారు. అయితే ఇందులో పాజిటివ్ కోణం ఉందంటున్నారు ఇంకొందరు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ లో దేనిలో పెట్టాలనే ఫ్లెక్సిబులిటీ  ఫండ్ మేనేజర్ కోల్పోతారు. దీంతో కస్టమర్ కు దీనిపై ఓ స్పష్టత ఉంటుంది. అదే సమయంలో దీర్ఘకాలికంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ మార్కెట్ వర్త్ పెరుగుతుంది. అంతిమంగా మార్కెట్ ప్రయోజనాలు నిలబడతాయంటున్నారు. 

సెబీకి ఫండ్ కంపెనీలు వినతి...
నిబంధనలపై అభ్యంతరం చెబుతున్నాయి ఫండ్ మేనేజింగ్ కంపెనీలు. సెబీ పునరాలోచన చేయాలని.. నిబంధనలు అసంబద్దంగా కనిపిస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. BSE500 బెంచ్ మార్కుతో చూస్తే 6శాతం మాత్రమే ఉన్న స్మాల్ క్యాప్ మల్టీ ఫండ్ ను 25శాతానికి పెంచినా ముందుముందు నిలబెట్టడం కష్టమని అంటున్నారు ఫండ్ మేనేజర్లు. స్మాల్ క్యాప్ స్టాక్స్ సహజంగానే లిక్విడిటీ సమస్య కారణంగా తక్కువగా ట్రేడ్ అవుతుంటాయి. పైగా ప్రస్తుతం మార్కెట్ కండీషన్ లో స్మాల్ క్యాప్ వెతికి మరీ ఇన్వెస్ట్ చేయడం సాధ్యమయ్యే పని కాదంటున్నారు. 2017లో తీసుకొచ్చిన నార్మ్ కొనసాగించాలంటున్నారు. మల్టీ క్యాప్ ను క్లాసిఫికేషన్ చేసి.. 65శాతం వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. అయితే మల్టీ, మిడ్, స్మాల్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కో దానిలో 25శాతం కనీస నిబంధన విధించారు. 

అయితే అంతిమంగా కంపెనీల ప్రయోజనాలు, ఇన్వెస్టర్ల లాభాలను ద్రుష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం అంటోంది సెబి. పూర్తిగా ఇది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల్లో సాధకబాధకాలు తెలిసే అవకాశం ఉంది. సొ.. మార్పులను మీరు గమనించి.. మీఫండ్ మేనేజర్ తో దీనిపై చర్చిస్తే మంచిది.