గత మూడేళ్లుగా వరుస లాభాలు పంచిన షేర్లు ఎంటో తెలుసా?

గత మూడేళ్లుగా వరుస లాభాలు పంచిన షేర్లు ఎంటో తెలుసా?

గత మూడేళ్లుగా వరుస లాభాలు పంచిన షేర్లు ఎంటో తెలుసా?
ఒక్క ఏడాదిలోనే 20శాతానికి పైగా లాభం
మూడేళ్లలో 15శాతం కనీస లాభాలు

మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు గుడ్డిగా పెట్టకండి. డేటా చూసుకుని ఎందులో లాభాలు వస్తున్నాయో చేసుకుని మరీ షేర్లు మీ పోర్ట్ పోలియోలో ఉండేలా చూసుకుండి. నిలకడగా లాభాలు ఇచ్చే వాటిని ప్రయత్నించింది. గతఏడాది కాలంలో కనీసం 25శాతానికి పైగా లాభాలు పంచాయి. మూడేళ్లలో అనిశ్చిత పరిస్థితులను తట్టుకుని 15శాతానికి ప్రాఫిట్స్ ఇచ్చాయి. ఇందులో లార్జ్ క్యాప్ ఉన్న కొన్ని కంపెనీల షేర్ల గురించి మీకు చెప్పబోతున్నాం. వీటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయమని కాదు.. కేవలం విశ్లేషణ మాత్రమే. నిర్ణయం మీదే. ఇలా చాలా కంపెనీలు కూడా లాభాలు పంచి ఉంటాయి. మాకు అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం.  

1. HCL టెక్నాలజీస్ ఒక్కో షేరుపై 2018లో రూ.31.37, 2019లో 37.34, 2020లో 40 రూపాలయకు పైగా లాభాలు పంచింది. ఈ21లో అయిత ఏకంగా 65శాతం ప్రాఫిట్ వచ్చింది. ప్రస్తుతం షేరు ధర రూ.721 వద్ద ట్రేడ్ అవుతోంది. 

2. బజాజ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఒక్కో షేరుపై 2018లో రూ.43, 2019లో రూ.69, 2020లో రూ.87లకు పైగా లాభం వచ్చింది. 2021లో ఇప్పటివరకూ 60శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.3543 వద్ద ట్రేడ్ అవుతోంది. 

3. బజాజ్ ఆటో  కంపెనీకి చెందిన ఒక్కో షేరుపై 2018లో రూ.145, 2019లో రూ.170, 2020లో రూ.180లకు పైగా లాభం వచ్చింది. 2021లో ఇప్పటివరకూ 44శాతం గెయిన్ అయింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.2914 వద్ద ట్రేడ్ అవుతోంది. 

4. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్  కంపెనీకి చెందిన ఒక్కో షేరుపై 2018లో రూ.144, 2019లో రూ.161, 2020లో రూ.170లకు పైగా లాభం వచ్చింది. 2021లో ఇప్పటివరకూ 43శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.2909 వద్ద ట్రేడ్ అవుతోంది. 

5.TCSకంపెనీకి చెందిన ఒక్కో షేరుపై 2018లో రూ.67, 2019లో రూ.83, 2020లో రూ.86లకు పైగా లాభం వచ్చింది. 2021లో ఇప్పటివరకూ 30శాతం గెయిన్ అయింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.2374 వద్ద ట్రేడ్ అవుతోంది. 

6.HDFC బ్యాంక్  కంపెనీకి చెందిన ఒక్కో షేరుపై 2018లో రూ.35, 2019లో రూ.41, 2020లో రూ.49లకు పైగా లాభం వచ్చింది. 2021లో ఇప్పటివరకూ 25శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.1079 వద్ద ట్రేడ్ అవుతోంది. 

7. ఫైజర్  కంపెనీకి చెందిన ఒక్కో షేరుపై 2018లో రూ.78, 2019లో రూ.93, 2020లో రూ.111లకు పైగా లాభం వచ్చింది. 2021లో ఇప్పటివరకూ 21శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.4875 వద్ద ట్రేడ్ అవుతోంది. 

8. కోటక్ మహీంద్రా  కంపెనీకి చెందిన ఒక్కో షేరుపై 2018లో రూ.32, 2019లో రూ.37, 2020లో రూ.44లకు పైగా లాభం వచ్చింది. 2021లో ఇప్పటివరకూ 3శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.1330 వద్ద ట్రేడ్ అవుతోంది. 

పైన ఇచ్చిన సమాచారం.. ఇంటర్నెట్ ఆధారంగా సేకరించిన సమాచారం. స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే 99శాతం ఇందులో ఖచ్చితత్వం ఉంటుంది.