సంపద ఎవరి సొత్తూ కాదు.. దమ్మున్నోడి సొంతం

సంపద ఎవరి సొత్తూ కాదు.. దమ్మున్నోడి సొంతం

సంపద ఎవరి సొత్తూ కాదు.. దమ్మున్నోడి సొంతం
వెనకబడుతున్న వారసులు
దూసుకెళుతున్న స్టార్టప్ హీరోలు
మైనింగ్, ఉత్పత్తిని దాటుతున్న హెల్త్, టెక్నాలజీ
ఇండియాలో బిలియనీర్ క్లబ్ ట్రెండ్ ఛేంజ్
వీకెండ్ ఎక్స్ క్లూజీవ్ స్టోరీ

కోటీశ్వరులు అంటే టాటా, బిర్లాలేనా? అంబానీలే ఎంతకాలం. మనపేరు చెప్పుకొవద్దా..? అవును ఈ ప్రశ్న నుంచే అభినవ బిలియనీర్లు పెట్టుకొస్తున్నారు. ఘనమైన వారసత్వం ఉంటేనే కోటాను కోట్లు సంపాదించొచ్చన్న అంధ విశ్వాసం క్రమంగా కనుమరుగవుతుంది. జీవితంలో లక్ష్యం, సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు సంప్రదాయ కోటీశ్వరులను పక్కకు నెట్టి ఒకమెట్టు పైనే నిలబడే అవకాశం సొంతమవుతుంది. దేశంలో సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు పెరుగుతున్న తీరు ఇందుకు అద్దం పడుతుంది. వారికి ఎలాంటి కుటుంబ వారసత్వాలు లేవు. పుట్టుకతోనే గోల్డన్ స్పూన్ కూడా కాదు.. అయినా దేశంలోనే అతిపెద్ద బిలియనీర్లుగా అవతరిస్తున్నారు. స్మార్ట్ ఇన్వెస్ట్ మెంట్, టెక్, హెల్త్ కేర్ రంగాల్లో ఆవిష్కరణలతో తమకలలను సాకారం చేసుకుంటున్నారు.

తిరగబడ్డ రోజులు
పోర్బ్స్ జాబితా ప్రకారం 2000వ ఏడాదిలో కేవలం ముగ్గురు రిచెస్ట్ వ్యక్తులు దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసేవారు. దాదాపు 61శాతం వారిచేతిలో ఉండేది. 2005లో 67శాతానికి పెరిగి.. ఐదేళ్లలో అంటే 2010కి ఇది 34శాతానికి పెరిగింది. 2015లో 20శాతంగా ఉంది. ప్రస్తుతం 20శాతానికి పరిమితం అయింది. అంటే 2010 తర్వాత కొత్తతరం బిలియనీర్లు పుట్టుకొచ్చారు. వారంతా సొంతంగా ఎదిగినవాళ్లే. స్టార్టప్ లేదా సొంత కంపెనీ పెట్టి మెజార్టీ వాటాలతో బిలియనీర్లుగా మారిన అభివన కోటీశ్వరులు వీరు. ఇటీవల పోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 102 బిలియనీర్ల సంపద మొత్తంలో సగం అంటే  164.4 బిలియన్ల డాలర్లు ఈ దశాబ్దంలో ఎదిగిన బిలియనీర్ల సొంతం.

పెరుగుతున్న ఇండివిడ్యువల్ బిలియనీర్లు
దేశంలో సెల్ప్ మేడ్ బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. 1996లో కేవలం 33శాతం మాత్రమే. 2001లో ఇది 50శాతానికి పెరిగింది. 2014లో 62శాతం, 2020లో 59శాతం వద్ద ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 70శాతంగా ఉంది. అయితే ఇండియాలో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో టెక్ బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. ఇందులో సచిన్ బన్సాల్, పేటీఎమ్ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, బైజూస్ రవీంద్రన్ ఇలా చాలామంది వేల కోట్ల సంపదను స్రుష్టించారు.   

మారుతున్న ట్రెండ్
ఒకప్పుడు కోటీశ్వరులు అంటే మనకు పారిశ్రామికవేత్తలు, మైనింగ్ బిజినెస్, నిర్మాణ రంగంలోని కంట్రాక్టర్లు, విద్యుత్ ప్లాంట్లు ఇలా ఉత్పత్తి రంగంలో టాప్ గా ఉండేవాళ్లు. కానీ ఈ ట్రెండ్ మారింది. 2010లో బిలియనీర్ల సంపదలో వాటా 57శాతం ఉంటే.. ప్రస్తుతం ఇది కేవలం 33శాతం మాత్రమే. కొత్తతరం టెక్నాలజీ బిలియనీర్లు ముందు.. GMR, వినోద్ గోయాంక, రాకేష్ విద్వానా వంటివాళ్లు వెనకబడ్డారు. ముఖేష్ అంబానీ జియో అంటూ టెక్నాలజీతో వచ్చి రేసులో నిలబడ్డారు. లేదంటే ఆయనా వెనకపడేవారు. విప్రొ, టాటా నిలబడానికి కారణం కూడా టెక్నాలజీనే. వారసత్వ వ్యాపారాలు చేస్తున్న వారిలో అనిల్ అంబానీ ఎక్కడున్నారో చూస్తున్నాం. అయితే మొత్తం వారసత్వ, ఇండస్ట్రీయల్ బారోన్స్ మొత్తం కాలగర్భంలో కలవలేదు. ఇంకా 28మంది కొత్తగా అ    వకాశాలను అందిపుచ్చుకుని నిలబడుతున్నారు. హెల్త్ కేర్ రంగంలో వీరు 17మంది ఉన్నారు. వెనకబడుతున్నారు.. కొత్తవాళ్లు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు దేశంలో టాప్ వ్యాపారవేత్తలుగా ఉన్న జిందాల్, గొద్రేజ్ వంటి కంపెనీలు సంప్రదాయ వ్యాపారాలతో  వెనకపడితే.. కొత్తగా వచ్చిన సంస్థలు వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్లు రాబడుతున్నాయి. ఇక్కడ కాలానుగుణంగా మారుతూ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అప్పుడే రేసులో ఉంటారు. ముఖేష్ అంబానీలా. 

ఇదంతా చూస్తుంటే ఒక్కటే అనిపిస్తుంది.. సంపద వారసత్వంగా రానవసరం లేదు. అవకాశాలను అందిపుచ్చుకుంటే స్లమ్ నుంచి ఎవరైనా ఎలైట్ ఏరియాలో విల్లాకు ఎదగవచ్చు. బిలియనీర్ల క్లబ్ లోకి మారొచ్చు. డబ్బు ఎవడి సొత్తూ కాదు. చేసేపని ఎంత పెద్దగా ఉందన్నది కాదు.. ఎంత స్మార్టుగా ఆలోచిస్తున్నావన్నది ఇప్పుడు ముఖ్యం. కావాల్సింది పట్టుదల, లక్ష్యం. కుటుంబ వారసత్వం కాదు. వారసత్వ వ్యాపారాలు అంతకన్నా కాదు. పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా అవసరం లేదు. రాకేష్ ధమానీ, కిషోర్ బియానీ మార్కెట్లో ఇన్వెస్టర్లుగా వచ్చి వేల కోట్ల సామ్రాజ్యాలు స్రుష్టించారు. పేటీఎమ్, బైజూస్, ఫ్లిప్ కార్ట్ వంటి టెక్ స్టార్టప్ ఐడియాలు చాలు.. జీవితం మార్చడానికి. మీరే భవిష్యత్తు హీరోలు. టాటాలు, బిర్లాల పేర్లు పోయి అంబానీలు వచ్చినట్టు ..రేపు మీ పేర్లు వినిపిస్తాయి.