అమ్మకానికి గ్రాన్యూల్స్ ఇండియా, ముందే చెప్పిన PYT

అమ్మకానికి గ్రాన్యూల్స్ ఇండియా, ముందే చెప్పిన PYT

హైదరాబాద్‌కు చెందిన పెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటైన గ్రాన్యూల్స్ ఇండియా యాజమాన్యం చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రమోటర్లైన చిగురుపాటి కృష్ణ ప్రసాద్, ఆయన కుటుంబం తమ వాటా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ఆమేరకు మర్చంట్ బ్యాంకర్లను  కూడా ఎంపిక చేసుకుని, కొనుగోలుదార్లను వెతికితెచ్చే బాధ్యతలు అప్పగించినట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. వాస్తవానికి ఇటువంటి ఆలోచన గ్రాన్యూల్స్ ప్రమోటర్లకు ఎంతోకాలంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఫార్మా పరిశ్రమకు అనుకూలతలు లేకపోవడం, కొనుగోలుదార్లు ముందుకు రాకపోవడం, కోరినంత విలువ విలువ లభించని పరిస్థితుల్లో... ఆ పని ముందుకు సాగలేదు. అయితే అనూహ్యంగా కరోనా మహమ్మారి వల్ల దేశీ ఫార్మా కంపెనీలకు భారీ ఎత్తున విలువ లభించింది. ముఖ్యంగా దేశీయ ఫార్మా కంపెనీలు తయారు చేసే ఔషధాలకు అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ఎత్తున గిరాకీ లభించడంతో అనూహ్యంగా ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. గత ఆరు నెలల కాలంలో ఈ పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో గ్రాన్యూల్స్ ఇండియా లాభాలు కూడా పెరిగాయి. ఒక్కో త్రైమాసికానికి రూ. 100 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జించే పరిస్థితి వచ్చింది. దీని ప్రకారం చూస్తే సంవత్సరానికి రూ. 400 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జించే కంపెనీ అయింది. తత్ఫలితంగా ఈ కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ కూడా బాగా పెరిగింది. గత మూడు నెలల కాలంలోనే రెండింతలు పెరిగి ప్రస్తుతం రూ. 9000 కోట్ల దగ్గరకు వచ్చింది. దీంతో ప్రమోటర్లు తమ వాటా విక్రయించడానికి ఇదే సరైన తరుణమని భావిస్తూ, ఆ ప్రక్రియను తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. ఈ మేరకు కోటక్ గ్రూప్‌ను మర్చంట్ బ్యాకర్‌ఘా ఎంపిక చేసినట్లు తెలిసింది. రూ. 10000 కోట్ల మార్కెట్ విలువకు అటూఇటూగా ఎవరైనా కొనుగోలుదార్లు వస్తే... తమ వాటా మొత్తంగా కానీ, పాక్షింకంగా కానీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. దీని ప్రకారం ప్రమోటర్ల వాటాకు రూ. 4000 కోట్ల వరకూ లభించవచ్చు.
ఈ కంపెనీ ప్రమోటర్లకు ప్రస్తుతం 42 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాలు విదేశీ సంస్థలు, దేశీయ సంస్థలు ఎన్నారైలు, దేశీయ మదుపరుల వద్ద ఉన్నాయి.

గ్రాన్యూల్స్ ఇండియా ప్రధానంగా పారాసెట్మాల్, ఐబూప్రూఫెన్, మెట్‌ఫామిన్ ఔషధాలు తయారు చేస్తోంది. కరోనా మహమ్మారి వల్ల పారాసెట్మాల్‌కు, ఐబూప్రూఫెన్‌కు అనూహ్యమైన గిరాకీ వచ్చింది. జ్వరం వస్తే... వెంటనే వాటాల్సిన మందు పారాసెట్మాల్. కరోనా వస్తే... ఏముంది, పారాసెట్మాల్ వేసుకుంటి సరిపోతుంది... అని నిన్నమొన్నటి వరకూ కొందరు భావించిన విషయం తెలిసిందే. కరోనా నుంచి పారాసెట్మాల్ పూర్తిగా కాపాడకపోయినప్పటికీ, ఆ జబ్బు వల్ల జ్వరం వస్తుంది కాబట్టి, పారాసెట్మాల్ వాడాల్సిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మందుకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇటీవల కాలంలో ఐరోపా దేశాల్లో పారాసెట్మాల్‌కు కొరత ఏర్పడినట్లు, దీనివల్ల కొన్ని దేశాల నుంచి గ్రాన్యూల్స్ ఇండియాకు విపరీతమైన ఆర్డర్లు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ... వ్యాపార పరంగా గ్రాన్యూల్స్ ఇండియాకు ప్రస్తుతం 'గోల్డెన్ పీరియడ్' నడుస్తున్నట్లు చెప్పుకోవచ్చు. దీనికి తోడు గత రెండేళ్ల కాలంలో ఈ సంస్థ అప్పుల భఆరం నుంచి చాలావరకూ బయటకు వచ్చింది. ప్రమోటర్లు కూడా తమ వ్యక్తిగత రుణ భారాన్ని బాగా తగ్గించుకుంటున్నారు. కంపెనీ ఆదాయాలు, లాభాలు పెరగడం ఇందుకు ఒక కారణం.

పైగా రెండు సబ్సిడరీ కంపెనీల్లో గ్రాన్యూల్స్ ఇండియా తన వాటా విక్రయించింది. ఈ విధంగా వచ్చిన సొమ్ముతో అప్పుల భారాన్ని తగ్గించుకునే అవకాశం వచ్చింది. సో... ఏ విధంగా చూసినా ఒక కంపెనీగా, గ్రాన్యూల్స్ ఇండియా ఇప్పుడు బాగా ఉందన్న మాట.

ఇటీవల కాలంలో దేశీయ ఫార్మా కంపెనీలను కొనుగోలు చేసేందుకు విదేశీ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే నాలుగైదు కంపెనీలను పీఈ సంస్థలు కొనుగోలు చేసిన విషయం గమనార్హం. ఇటువంటి లావాదేవీలు హైదరాబాద్‌లోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రాన్యూల్స్ ఇండియాలో సైతం మెజార్టీ వాటా కొనుగోలు చేసి, ఆ కంపెనీని సొంతం చేసుకునేందుకు పీఈ సంస్థలు ముందుకు వస్తాయని భావిస్తున్నారు. అదే జరిగితే ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో నమోదైన అతిపెద్ద కార్పొరేట్ డీల్‌గా, గ్రాన్యూల్స్ ఇండియా లావాదేవీ నిలిచిపోతుంది.

  • గ్రాన్యూల్స్ ఇండియా ముఖ చిత్రం
  • ఈక్విటీ షేర్ ముఖ విలువ: రూ. 1
  • షేర్ ధర:  రూ. 364
  • మార్కెట్ కేపిటలైజేషన్:  రూ. 9000 కోట్లు(సుమారు)
  • జారీ మూలధనం: రూ. 24,71,46,188
  • ప్రమోటర్ల వాటా:  42.13 శాతం
  • పబ్లిక్ షేర్ హోల్డర్లలో విదేశీ సంస్థలు
  • లజార్డ్ ఎమర్జింగ్ మార్కెట్స్ -    1.92 శాతం
  • ఫిడిలిటీ ఫండ్స్ -     2.18 శాతం
  • గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ -    2.76 శాతం

దేశీయ సంస్థలు
* ఎల్ఐసీ ఆఫ్ ఇండియా: 3.08 శాతం

ఎన్నారైలు
వ్యక్తిగత ఎన్నారై ఇన్వెస్టర్లు: 1.96 శాతం

ఇతరులు
మహిమా స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్: 1.80 శాతం

పీవైటీ ఎప్పుడో గుర్తించింది
గ్రాన్యూల్స్ ఇండియా ఇటీవల కాలంలో వ్యాపారం పరంగా అత్యంత క్రియాశలీకంగా మారి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టబోతోందనే విషయాన్ని ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ ఏనాడో చెప్పింది. దీనిపై నెలన్నర క్రితమే ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది.

 

[ఆగస్ట్‌లో గ్రాన్యూల్స్ ఇండియాపై ఎక్స్‌క్లూజివ్‌గా అందించిన ఆర్టికల్]

 

మార్కెట్ వర్గాల్లో ప్రచారంలో ఉన్నట్లుగా గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్లు వాటా విక్రయించిన పక్షణంలో, ఈ కంపెనీ షేర్‌కు ఇంకా గిరాకీ రావచ్చు. దీన్ని కొనుగోలు చేసే సంస్థ ఒక్కో షేర్‌కు ఇచ్చే ధర ప్రకారమే కాకుండా, ఆ తర్వాత ఆ సంస్థ, సాధారణ వాటాదార్లకు 'ఓపెన్ ఆఫర్' ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ప్రమోటర్లకు ఇచ్చిన షేర్ ధరనే... లేదా అంతకంటే ఎక్కువే ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఈ కంపెనీ షేర్లకు మార్కెట్లో ప్రస్తుతానికి మంచి గిరాకీ లభించే అవకాశం కనిపిస్తోంది.