ఈ స్టేజిలో బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చా?

ఈ స్టేజిలో బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చా?

బంగారంపై మక్కువ తగ్గిందా?
తగ్గుతున్న ధరలు
స్టాక్ మార్కెట్ వైపు మదుపరులు
50వేల లోపుకు వస్తుందా? 

మిడిసిపడిన పసిడి క్రమంగా నెలకు దిగుతోంది. హద్దుల్లేవన్నట్టుగా ఆకాశం తాకిన యల్లో మెటల్ మళ్లీ నేలచూపులు చూస్తోంది. అమెరికా డాలర్‌ బలపడటంతో బంగారం తెల్లబోతుంది. ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్‌ భారీగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 245 తగ్గి.. 51 వేల 108 రూపాయలకు తగ్గింది. కిలో వెండి 712 రూపాయలు పడిపోయి.. రూ.67 వేల 782 రూపాయలు ముగిసింది. 

ఎందుకు పెరిగింది...
గత నెలలో రికార్డు స్ధాయిలో బంగారం ధర 56వేలు దాటింది.వెండి సైతం గత నెల ఏకంగా 80,000 రూపాయలకు చేరింది. ఏడాది చివరి నాటికి బంగారం ఏకంగా రూ.80వేలకు చేరుతుందని అంచనా వేశారు. కోవిడ్ సంక్షోభంతో ఎకానమీ సంక్షోభంలో ఉంది. మార్కెట్లు మార్చిలో భారీగా పతనం అయ్యాయి. డాలర్ నేలచూపులు చూసింది. ఇక రియాల్టీ అయితే ఏకంగా 80శాతం పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ బంగారం లాంటి ఐడియా గోల్డ్ అనుకున్నారు. అంతే.. ఇన్వెస్టర్లు భారీగా పెట్టారు. దీనికి తోడు గోల్డ నిల్వలు కూడా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధర ఆకాశంలో ఉంది. 

ఎందుకు తగ్గుతోంది..
గత నెలతో పోల్చితే గోల్డ్ ప్రైస్ దాదాపు 5వేల వరకూ తగ్గింది. అయితే ఇప్పటికీ 50వేలకు పైగానే ఉంది. అదలా ఉంచితే తగ్గడానికి కారణం మాత్రం మార్కెట్లో సానుకూల సంకేతాలు రావడమే. స్టాక్ మార్కెట్లు మళ్లీ మార్చి నాటి గరిష్ట మార్కును అందుకున్నాయి. డాలర్ బలపడుతోంది. వ్యాక్సిన్ పై సానుకూల సంకేతాలున్నాయి. జనాల వద్ద లిక్విడిటీ ఉండటంతో స్టాక్ మార్కెట్లపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సహజంగానే మళ్లీ మార్కెట్ల వైపు మదుపరులు రావడంతో యల్లో మెటల్ వెలవెలబోతుంది. ఇక బంగారం ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులతోనే సాగుతాయని బులియన్‌ నిపుణులంటున్నారు.