హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ ఐపీఓకు స్పందన అదుర్స్‌..

హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ ఐపీఓకు స్పందన అదుర్స్‌..

సోమవారం ప్రారంభమైన హ్యాపియెస్ట్‌ ఐపీఓకు అద్భుత స్పందన లభిస్తోంది. బుధవారంతో ముగిసే ఈ ఇష్యూకు మంగళవారం ఒంటిగంట సమయానికి 4.84 రెట్ల స్పందన వచ్చింది. మొత్తం 2,32,59,550 షేర్లకు గాను 11,26,37,070 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో కట్‌ ఆఫ్‌ ధరతో 7,58,26,440 షేర్లకు బిడ్లు వచ్చాయి. ఇక రిటైల్‌ పోర్షన్‌లో 22 రెట్ల స్పందన వచ్చింది. 

బెంగళూరుకు చెందిన మిడ్‌సైజ్‌ డిజిటల్‌ ఐటీ కంపెనీ హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ రూ.702 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చింది. సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన ఈ ఇష్యూ సెప్టెంబర్‌ 9న ముగియనుంది. ముఖ్యంగా ఈ ఇష్యూకు రిటైల్‌ ఇన్వెస్టర్లు అధిక ఆసక్తి చూపుతున్నారు. నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ విభాగంలో 116 శాతం, క్యూఐపీ విభాగంలో 8.36 శాతం బిడ్లు దాఖలయ్యాయి.