యాక్ట్ ఫైబర్ నెట్ తో హూక్ భాగస్వామ్యం

యాక్ట్ ఫైబర్ నెట్ తో హూక్ భాగస్వామ్యం

 ఆసియాలోనే అతిపెద్ద ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ సర్వీసస్ కంపెనీగా పేరున్న " హూక్ " తమ సేవలను విస్తరించేందుకు సౌతిండియాలో  బ్రాడ్ బాండ్ సేవలందిస్తోన్న  యాక్ట్ ఫైబర్ నెట్  తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ పార్టనర్ షిప్ కింద యాక్ట్ కస్టమర్లు ఒక నెలరోజుల పాటు హూక్ సబ్ స్క్రిప్ఫన్ ను ఫ్రీగా పొందవచ్చని తద్వారా పది వేలకు పైగా హాలివుడ్, బాలీవుడ్ తో పాటు రీజనల మూవీస్ కూడా వీక్షించవచ్చని హూక్ ఇండియా ఎండీ సలీల్ కపూర్ తెలిపారు. సినిమాలతో పాటు టీవీ షోస్, కామెడీ షోస్, రియాల్టీ షోస్ అందుబాటులో ఉంటాయని , నెలకు 249 రూపాయలకే అన్ లిమిటెడ్ మూవీస్ ఒకే సారి 5 డివైజ్ లకు కనెక్ట్ చేసుకొనే వీలుందని ఆయన తెలిపారు. హూక్ తో ఈ ఒప్పందంతో తమకు లాభిస్తుందని.. తమకున్న సుమారు 2 మిలియన్ యూజర్లు నెలరోజుల పాటు ఉచితంగా ఈ సేవలందుకోవచ్చని యాక్ట్ సీఒఒ సౌరభ్ ముఖర్జీ తెలిపారు. ఆప్టిక్ ఫైబర్ ఇంట్నరెట్ సేవలందిస్తూ దక్షిణాదిన నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నామని ..గతేడాది రాజధాని ఢిల్లీలో తమ సేవలను విస్తరించామని త్వరలో మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రవేశించాలనే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. గతేడాది తమ టర్నోవర్ 1250 కోట్ల రూపాయలుగా ఉందని ఈ ఏడాది మరో 20 శాతం మేర వ్రుద్ధిని నమోదు చేస్తామని సౌరభ్ అంటున్నారు.Most Popular