వచ్చే నెల 26 నుంచి టై-ఐఎస్‌బీ కనెక్ట్‌ సదస్సు

వచ్చే నెల 26 నుంచి టై-ఐఎస్‌బీ కనెక్ట్‌ సదస్సు

ది ఇండస్ ఎంట్రపెన్యూర్స్ హైదరాబాద్ చాప్టర్, ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా "టై-ఐఎస్బీ కనెక్ట్-2016 "ఏడవ ఎడిషన్ ను వచ్చే అక్టోబర్ 26,27 తేదీలలో హైదరాబాద్ ఐఎస్బీలో నిర్వహించనుంది. డీ కోడ్ డిస్‌రప్టివ్ టెక్నాలజీస్ అండ్ న్యూ బిజినెస్ మోడల్స్ అనే అంశాలను ప్రధానంగా ఈ సదస్సులో చర్చించనున్నట్లు టై హైదరాబాద్ ప్రెసిడెంట్ సురేష్ చల్లా తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో మొత్తం 50 మంది స్పీకర్లతో 6 పానల్ డిస్కషన్స్ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈ ఈవెంట్ లో ఎంట్రపెన్యూర్స్ తో పాటు స్టార్టప్ కంపెనీలు పాల్గొంటాయని అదే విధంగా ఇన్వెస్టర్లు , ఫండ్ రైజింగ్ సంస్థలు సుమారు వంద కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశముందని "టై-ఐఎస్బీ కనెక్ట్-2016 " చైర్ పర్సన్ అనంతరావు తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుందని వచ్చే రెండు మూడేళ్ళలో అన్ని రంగాల్లో  ఆటోమేషన్ ప్రధాన పాత్ర పోషించనుందని ఆయన తెలిపారు. దీంతో సుమారు 50లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని అనంత్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎలా అప్ డేట్ అవ్వాలనే అంశాన్ని ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నామని ఆయన అన్నారు. ఎంట్రపెన్యూర్స్ సరికొత్త బిజినెస్ మోడల్స్ ను ఆవిష్కరించేందుకు  "టై-ఐఎస్బీ కనెక్ట్-2016 " ఈవెంట్ సరైన వేదికని ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాత్పవ అన్నారు. మొబైల్స్, ఐఓటీ, ఇ-హెల్త్ ,స్కిల్ ఇండియా, ఫిన్ టెక్ , మేకిన్ ఇండియా సంబంధించిన సెషన్స్ ఇక్కడ జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ సదస్సు ఇటు స్టార్టప్స్ కి అటు ఇన్వెస్టర్స్ కి మంచి ఫ్లాట్ ఫామ్ అని శ్రీవాత్పవ తెలిపారు.Most Popular