5 నెలల గరిష్టానికి రెడింగ్‌టన్‌

5 నెలల గరిష్టానికి రెడింగ్‌టన్‌

11 సంవత్సరాల తర్వాత తొలిసారిగా రెడింగ్‌టన్‌లో భారీ జోష్‌ నెలకొంది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 18.6శాతం లాభపడి రూ.111.55కు చేరింది. 2009 మే తర్వాత సింగిల్‌ డేలో ఈ స్టాక్‌లో ర్యాలీ రావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఈ స్టాక్‌ 16శాతం లాభంతో రూ.109 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 40.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 


జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 10శాతం క్షీణతతో రూ.99 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 8శాతం తగ్గి రూ.10,697 కోట్లకు పడిపోయింది. ఎబిటా 8శాతం క్షీణతతో రూ.205.6 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్‌ ఒకశాతంగా ఉంది. 


ఇండియా బిజినెస్‌ రెవిన్యూ 17శాతం తగ్గి రూ.3446 కోట్లకు చేరింది. ఓవర్సీస్‌ బిజినెస్‌ రెవిన్యూ 4శాతం క్షీణించి రూ.7251 కోట్లకు పరిమితమైంది. వర్కింగ్‌ క్యాపిటల్‌ డేస్‌ 57 నుంచి 12కు పడిపోయింది.