బజింగ్‌ స్టాక్‌ : మూడేళ్ళ గరిష్టానికి లుపిన్‌

బజింగ్‌ స్టాక్‌ : మూడేళ్ళ గరిష్టానికి లుపిన్‌

నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లో టాప్‌ పెర్ఫామర్‌గా ఇవాళ దూసుకుపోతోంది లుపిన్‌. గత 3 రోజులుగా నష్టాల్లో ట్రేడైన ఈ స్టాక్‌కు ఇవాళ భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. ఇంట్రాడేలో షేర్‌ 9శాతం లాభపడి రూ.1014కు చేరింది. ఇది 2017 నవంబర్‌ గరిష్ట స్థాయి కావడం విశేషం. ప్రస్తుతం 8శాతం పైగా లాభంతో రూ.1004.95 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. 

వాల్యూమ్స్‌ విషయానికి వస్తే 20 రోజుల సగటుతో పోలిస్తే 4 రెట్లు పెరిగాయి. వరుసగా నాల్గో రోజూ 50 రోజుల సగటు కదలిక స్థాయి ఎగువన షేర్‌ కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 13న 52వారాల కనిష్ట స్థాయి రూ.504కు పడిపోయిన ఈ స్టాక్‌ ప్రస్తుతం రెట్టింపు స్థాయి ఎగువన ట్రేడవుతోంది.