వరుసగా నాల్గో రోజూ భారత్‌ రసాయన్‌లో నష్టాలు

వరుసగా నాల్గో రోజూ భారత్‌ రసాయన్‌లో నష్టాలు

తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపర్చడంతో వరుసగా నాల్గోరోజూ భారత్‌ రసాయన్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. ఇవాళ ఇంట్రాడేలో 8శాతం నష్టపోయి రూ.9776కు పడిపోయింది. ప్రస్తుతం 6శాతం పైగా నష్టంతో రూ.10040 వద్ద షేర్‌ కొనసాగుతోంది. ఇవాళ ఇప్పటివరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 13500 షేర్లు ట్రేడయ్యాయి. 

కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయానికి వస్తే రూ.4506.43 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 47.10 కాగా కంపెనీ పీ/ఈ 28.61గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.1327.73, ఈపీఎస్‌ రూ.371.03గా ఉన్నాయి. 

ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారత్‌ రసాయన్‌ నికరలాభం 12శాతం వృద్ధితో రూ.46.7 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం 20.5శాతం క్షీణతతో రూ.281.7 కోట్లకు పరిమితమైంది. ఎబిటా 7.5శాతం తగ్గి రూ.65.5 కోట్లకు పడిపోయింది. ఎబిటా మార్జిన్‌ 20శాతం నుంచి 23.3 శాతానికి ఎగబాకింది.