నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఔట్‌పెర్ఫామర్‌ బ్లూస్టార్

నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఔట్‌పెర్ఫామర్‌ బ్లూస్టార్

బ్లూస్టార్‌లో జోరు కొనసాగుతోంది. ఇవాళ ఇంట్రాడేలో 8.5శాతం లాభపడిన షేర్‌ రూ.562కు చేరింది. ప్రస్తుతం ఈ బ్లూస్టార్‌ 4 నెలల గరిష్ట స్థాయి దగ్గర ట్రేడవుతోంది. అలాగే సింగిల్‌ డేలో ఈ స్టాక్‌ ఇంతలా లాభపడటం గత 4 నెలల్లో ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ స్టాక్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో ఔట్‌పెర్ఫామర్‌గా కొనసాగుతోంది. 

చివరి 10 ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఈ స్టాక్‌ 7 సెషన్లలో లాభాల్లో కొనసాగింది. ఇవాళ ఈ స్టాక్‌ వాల్యూమ్స్‌ మెరుగ్గా ఉన్నాయి. 20 రోజుల సగటుతో పోలిస్తే ఈ స్టాక్‌ వాల్యూమ్స్‌ ఇవాళ ఇప్పటివరకు దాదాపు 30 రెట్లకు పైగా పెరిగాయి. వరుసగా ఐదో రోజూ బ్లూస్టార్‌ 100 రోజుల సగటు కదలిక స్థాయి రూ.499.8 ఎగువన ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 24న 52 వారాల కనిష్ట స్థాయి రూ.409కు పడిపోయిన బ్లూస్టార్‌... ప్రస్తుతం ఆ స్థాయికి 37శాతం ఎగువన ట్రేడవుతోంది.