వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్.. నాట్కో ఫార్మా...

వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్.. నాట్కో ఫార్మా...

స్టాక్‌మార్కెట్లో ప్రస్తుత ఫార్మా ర్యాలీలో ఇంకా పెద్దగా 'పార్టిసిపేట్' చేయని షేర్ నాట్కో ఫార్మా. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ఫార్మా కంపెనీ కేన్సర్ ఓషధాల వంటి "నిష్" ఏరియాలో ఉండడం ప్రత్యేకత. ఏపీఐ(యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్), ఫార్ములేషన్స్ తయారు చేసే ఈ సంస్థ ఆదాయాల్లో సగానికి పైగా కేన్సర్ ఔషధాల నుంచే సమకూరుతున్న విషయం గమనార్హం. దేశీయంగా కేన్సర్ ఔషధాల్లో నాట్కో ఫార్మా సంస్థ అగ్రగామిగా ఉంది. అదే విధంగా నార్త్ అమెరికా (యూఎస్, కెనడా) మార్కెట్లోనే క్రమం తప్పకుండా రెండు మూడేళ్లకోసారి కొత్త ఔషధాలను ప్రవేశపెడుతూ వస్తోంది. కేన్సర్ వంటి స్పెషాలిటీ ఔషధఆల విభాగంలో ఉండడంతో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ గత కొంతాకలంగా రూ. 2000 కోట్లకు పైగా వార్షిక ఆదాయాలను, రూ. 500 కోట్ల వార్షిక నికరలాభాన్ని ఆర్జిస్తూ వస్తోంది. దీనికి తోడు వచ్చే రెండేళ్ల వ్యవధిలో వచ్చే కొత్త ఔషధాల వల్ల ఆదాయాలు, లాభాల్లో 'బ్రేకౌట్' రాబోతోందని తెలుస్తోంది. దీనివల్ల కంపెనీ సంస్థాగత విలువ, షేర్ విలువ బాగా పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇందువల్ల ఇప్పుడిప్పుడే ఈ షేర్ ‌స్టాక్‌మార్కెట్లో మదుపరులను ఆకర్షిస్తోంది.

కొవిడ్-19 ప్రభావం
దేసీయ కేన్సర్ ఔషధాల విభాగాల్లో అగ్రాగమిగా ఉన్న నాట్కో ఫార్మాను కొవిడ్-19 కొంత ఇబ్బంది పెట్టింది. కేన్సర్ ఔషధాల విక్రయాలు నేరుగా ఆస్పత్రులు-వైద్యుల ద్వారా జరుగుతాయి. మెడికల్ స్టోర్లలో ఓటీసీ (ఓవర్ ద కౌంటర్) అమ్మకాలు తక్కువ. కేన్సర్ పేషెంట్లు ఆసుపత్రులలో చేరితే, వారికి నేరుగా డాక్టర్, కీమోథెరపీ పద్ధతిలో  కేన్సర్ ఔషధాలు ఇస్తారు. గత ఆరు నెలలుగా కొవిడ్-19 రోగులు ఆస్పత్రుల్లో చేరడం, కొత్త కేసుల నమోదు తగ్గినట్లు, తత్ఫతిలతంగా దేశీయంగా కేన్సర్ ఔషధాల అమ్మకాలు కొంత తగ్గాయి. దీనికి తోడు లాజిస్టిక్స్ సమస్యలు ఎదురయ్యాయి. రవాణా వ్యయాలు పెరిగాయి. దీని ప్రభావం నాట్కో ఫార్మా ఆదాయాలపై పడింది. కానీ ఈ ప్రభావం తాత్కాలికమేనని, మళ్లీ ఇప్పుడు పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వస్తున్నాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి కంపెనీ పని తీరు ఎంతో బాగుంటుందని తెలుస్తోంది.

 

పారా-4 ఫైలింగ్స్
అతిపెద్ద ఔషధ మార్కెట్ అయిన యూఎస్‌లో జనరిక్ ఔషధాలను పేటెంట్ల గడువు పూర్తయిన తర్వాత ఏ కంపెనీ అయినా ప్రవేశపెట్టవచ్చు. కానీ గడువు తీరడానికి ఆరు నెలల ముందు ఒక కంపెనీ ఓషధానికి యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి ఇస్తుంది. దీనివల్ల దాదాపు పేటెంట్ ఔషధం ధరకు దగ్గరగా తమ ఔషధాన్ని ఇటువంటి అనుమతి పొందిన కంపెనీ అమ్ముకోవచ్చు. తద్వారా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇటువంటి అనుమతిని పా-4 లాగ్ అంటారు. నాట్కో ఫార్మా వద్ద ఇటువంటి దాదాపు 20 ఔషధాలు ఉండడం ఆసక్తికరమైన విషయం. ఇందునలో కొన్ని ముఖ్యమైన ఔషధాలు ఉన్నాయి. 

 • సొరా ఫెనిబ్ (కిడ్నీ, లివర్ కేన్సర్)
 • రెవ్లీమిడ్(కేన్సర్ -మల్టిపుల్ మైలోమా)
 • ఇబ్రువికా (లుకేమియా)
 • సొవాల్డి (యాంటీ వైరల్, హెపటైటస్-సి ఔషధం)
 • టార్సెవా (పాన్‌క్రియాటిస్ కేన్సర్)
 • అబాజియో (టెరిఫునోమైడ్ ఔషధం, మల్టిపుల్ స్కెలరోసిస్ వ్యాధిని అదుపు చేసేది)

 ఈ ఔషధాల తయారీ ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. తద్వారా వాటికి యూఎస్‌లో పేటెంట్ ఛాలెంజ్ చేసి, ఎంఎన్‌సీ ఫార్మా కంపెనీలతో న్యాయపోరాటాల్లో నెగ్గి ఔషధాన్ని విక్రయించడం అంతకంటే పెద్ద సవాలు. కానీ ఒక్క ఔషధానికి అనుమతి సంపాదించినా కళ్లు చెదిరే ఆదాయాలు సొంతం అుతాయి. నాట్కో ఫార్మా ఇప్పటికే ఇటువంటి నాలుగైదు ఔషధాలను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. రెండేళ్ల క్రితం జీ-కొపాగ్జోన్ ఔషధంగా పెద్ద ఎత్తున ఆదాయలు సంపాదించిన విషయం తెలిసిందే. ఇటువంటి అవకాశాలను నిరంతరం అన్వేషిస్తూ, ముందుకు సాగుతున్న దేశీ ఫార్మా కంపెనీల్లో నాట్కో ఫార్మా ఒకటి కావడం ప్రత్యేకత.

 

బ్లాక్ బస్టర్ డ్రగ్ ... జీ-రెవ్లీమిడ్

 • కొన్ని రకాలైన కేన్సర్ వ్యాధులకు చికిత్సలో వినియోగించే జీ-రెవ్లీమిడ్ (జనరిక్ ఔషధం పేరు - లెనలిడోమైడ్) ఔషధాన్ని యూఎస్, కెనడా మార్కెట్లలో విక్రయించేందుకు మూడేళ్ల క్రితమే నాట్కో ఫార్మా దరఖాస్తులు చేసింది. ఈ ఔషధం పేటెంట్ యూఎస్‌కు చెందిన సెల్‌జీన్ అనే కంపెనీకి ఉంది. ఏటా 8 బిలియన్ డాలర్లు (దాదాపు 63 వేల  కోట్లు) అమ్మకాలు నమోదు చేసే ఈ ఔషధం ప్రపంచవ్యాప్తంగా టాప్-10 ఔషధాల్లో ఒకటిగా ఉండడం గమనార్హం.
 • కెనడా మార్కెట్‌లో దీనికి సంబంధఇంచి ఇటీవల నాట్కో ఫార్మా, సెల్‌జీన్‌‍తో కలిసి ఇటీవల పేటెంట్ సర్దుబాటు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి గానూ సెల్‌జీన్ నుంచి నాట్కో ఫార్మాకు కొంత సొమ్ము లభిస్తుంది. అది ఎంతనేది కంపెనీ వెల్లడించలేదు. గత ఏడాది మొదటి త్రైమాసికంలో ఇటువంటి సర్దుబాటు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, సెల్‌జీన్‌తో చేసుకుంది. అందుకు గాను డాక్టర్ రెడ్డీస్‌కు అప్పట్లో సెల్‌జీన్ నుంచి రూ. 350 కోట్లు లభించాయి. అదంేవిధంగా నాట్కో ఫార్మాకు కూడా ఆకర్షణీయమైన మొత్తం లభిస్ుతంది.
 • ఇక యూఎస్ మార్కెట్లో 2022 మార్చి తర్వాత జి-రెవ్లిమీడ్ ఔషధాన్ని నాట్కో ఫారమా విక్రయించే అవకాశం వస్తుంది. ఈ ఔషధం వార్షిక అమ్మకాల్లో 4-5 శాతం మార్కెట్ వాటా సంపాదించినప్పటికీ, అది నాట్కో ఫార్మాకు కాసుల వర్షం కురిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
 • రెండేళ్ల క్రితం జి-కొపాగ్జోన్ ఔషధాన్ని మైలాన్ ల్యాబ్స్‌తో కలిసి యూఎస్‌లో విడుదల చేసినప్పుడు ఎంత పెద్ద ఆదాయన్ని నాట్కో ఫార్మా కళ్లజూసిందో... అంతకంటే ఎక్కువ మొత్తమే జీ-రెవ్లీమిడ్‌ నుంచి వచ్చే అవకాశం ఉంది.
 • ఆ విధంగా చూస్తే 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో నాట్కో ఫారమా అనూహ్యమైన ఆదాయాలు, లాభాలు నమోదు చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

 

అగ్రోకెమికల్ వ్యాపారం

ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగానికే పరిమితం కాకుండా, అగ్రో కెమికల్స్ (పురుగు మందులు, రసాయనాలు) తయారీలోనూ క్రియాశీలకంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఏదైనా కెమిస్ట్రీనే కాబట్టి, అటు ఫార్మా ఉత్పత్తులు, ఇటు అగ్రో కెమికల్స్ తయారీని కొన్ని కంపెనీలు చేపట్టి బహుముఖంగా ఎదిగాయి. అటువంటి కంపెనీల్లో బేయర్, సింజెంటా, మోన్‌శాంటో, డ్యూపాంట్.. వంటి కంపెనీలు కనిపిస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకుని నాట్కో ఫార్మా అగ్రోకెమికల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. దీని కోసం సూళ్లూరుపేట సమీపంలో కొత్త అగ్రో కెమికల్స్ తయారీ యూనిట్‌ను నిర్మించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్ ఉత్పత్తి కార్యకలాపాలు మొదలుకావచ్చు. ఇప్పటికే నాట్కో ఫార్మా రెండు అగ్రోకెమికల్ ఉత్పత్తులకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఈ ఏడాదిలో వాటికి అనుమతి వచ్చి ఉత్పత్తిృ- విక్రయాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ విభాగంలోనూ ఫార్మాలో చేసినట్లే పెద్ద కంపెనీ పేటెంట్లను సవాలు చేసి, అధిక విలువ ఉన్న కొత్త పురుగు మందులను మార్కెట్లోకి తీసుకురావాలని నాట్కో ఫార్మాప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎత్తుగడ ఫలిస్తే నాలుగైదేళ్లలో అగ్రోకెమికల్స్ విభాగం నుంచే రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల టర్నోవర్ సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కంపెనీకి సంబంధించినంతవరకూ ఇదొక పెద్ద సానుకూలత.

 

ఇతర ప్రత్యేకతలు
నాట్కో ఫార్మాకు ఉన్న మానుఫ్యాక్చరింగ్ -ఆర్ అండ్ డీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దేశీయ ఫార్మా కంపెనీల్లో కొన్ని కంపెనీలకు మాత్రమే ఉందడనంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హైదరాబాద్ (కొత్తూరు, మేకగూడ, సనత్‌నగర్), నాగార్జున సాగర్, చెన్నై, విశాఖపట్నం(ఫార్మా సిటీ), గౌహతి, డెహ్రాడూన్ (ఉత్తరఘండ్) లలో ఈ కంపెనీకి బల్క్ డ్రగ్ర్స్ - ఏపీఐలు, ఫార్ములేషన్లు తయారు చేసే యూనిట్లు ఉన్నాయి. దాదాపు 500 మంది సైంటిస్టులు పని చేస్తున్న ఆర్ఆండ్‌డీ సెంటర్ హైదరాబాద్‌లో ఉంది.


కంపెనీ యూనిట్లకు, ఔషధాలకు యూఎస్ఎఫ్‌డీఏ అనుమతులు ఉన్నాయి. యూఎస్ఎఫ్‌డీఏ ఆడిట్‌లో కొన్ని పెద్ద కంపెనీలకు సైతం ఎప్పుడూ రిమార్క్‌లు, 483-నోటీసులు జారీ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. కానీ నాట్కో ఫార్మాకు  ఇంతవరకూ యూఎస్ఎఫ్‌డీఏ నుంచి మేజర్ అబ్జెక్షన్స్ వచ్చిన దాఖలాలు లేవు. విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన నాట్కో ఫార్మా ప్లాంట్‌కు రెండు నెలల క్రితం యూఎస్ఎఫ్‌డీఏ టీమ్, ఆడిట్‌కు వ్చి వారం రోజుల్లో క్లీన్ చిట్ ఇచ్చింది. ఔషధ తయారీ ప్రమాణా విషయంలో కంపెనీ అప్రమత్తంగా ఉంటుందనడానికి ఇవన్నీ ఉదాహరణలు.


కంపెనీకి అప్పు లేదు. ఇదీ జీరో డెట్ కంపెనీ. పైగా రూ. 1000 కోట్ల వరకూ నగదు చేతిలో ఉండడం ప్రత్యేక ఆకర్షణ.

పూర్తిగా రీసెర్చ్ ఫోక్స ఉన్న యాజమాన్యం, మేనేజ్‌మెంట్ టీమ్ ఉండడం నాట్కో ఫార్మాకు కలిసివచ్చే విషయం. పైగా హై వాల్యూ-లో వాల్యూమ్ కల ఔషధాల మీద యాజమాన్యం దృష్టి సారిస్తోంది. దీనివల్ల లాభాల్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం కంపెనీకి ఉంది.
క్రమం తప్పకుండా ఆకర్షణీయమైన షేర్ డివిడెండ్ చెల్లిస్తూ వస్తోంది.


కంపెనీ పెయిడ్-అప్ కేపిటల్ 18.20 కోట్ల షేర్లు (షేర్ ముఖ విలువ రూ. 2). ఇందులో దాదాపు 50 శాతం యాజమాన్యానికి ఉంది. దాదాపు 20 శాతం వాటా కలిగిన ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలో - ఈస్ట్‌బ్రిడ్జ్ కేపిటల్, ప్లెంటీ ప్రైవేట్ ఈక్విటీ, నొమురా సింగపూర్, టీచర్ రిటైర్మెంట్ సిస్టమ్ ఆఫ్ టెక్సాస్ తదితర విదేశీ ఫండ్స్ ఉన్నాయి. దేశీయ మ్యూచువల్ ఫండ్లు అయిన - ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, మిర్రే అస్సెట్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్లు,... దాదాపు 9 శాతం వరకూ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం మీద విదేశీ ఫండ్లు, దేశీయ మ్యూచువల్ ఫండ్ల చేతిలో 30 శాతం వరకూ వాటా ఉంది. ఇక సాధారణ ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న వాటా 20 శాతమే.

 

రూు. 500 కోట్ల వార్షిక లాభం ఎక్కడకీ పోదు...
నాట్కో ఫార్మా వార్షికాదాయాలు రూ. 2000 కోట్లకు మించిపోతున్నాయి. అదే విధంగా వార్షిక నికర లాభం రూ. 500 కోట్లకు పైగానే ఉంటోంది. గత రెండేళ్లలో కొంత తగ్గినప్పటికీ ఇకపై ఏటా రూ. 500 కోట్లకు పైగానే వార్షిక లాభం ఉండబోతోంది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీకి అధఇక లాభఆలు సంపాదించడానికి వీలు కల్పించే ఎన్నో ట్రిగ్రర్లు ఉన్నాయి. జీ-రెవ్లీమిడ్, ఒక గొప్ప అవకాశం కాగా.. అగ్రో కెమికల్స్ వ్యాపారం మొదలు కాబోతోంది. ఇంకా.. కేన్సర్ విభాగాల్లో అయిదారు కీలకమైన ఔషధాలపై కంపెనీ పరిశోధనలు అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ ఔషధాలు బాగా పని చేస్తున్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలినట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే కంపెనీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు.

నాట్కో ఫార్మా వార్షిక ఆదాయాలు, లాభాల అంచనాలు (రూ. కోట్లలో...)

ఆదాయ వివరాలు 2018-19 2019-20 2020-21** 2021-22**
ఆదాయం 2095 1915 1986 2553
ఎబిటా 795 583 609 739
నికరలాభం 645 461 480 580
ఈపీఎస్ 35 25 26 33


**ముందస్తు అంచనాలు
-ఎబిటా (వడ్డీ, తరుగుదల, ఆపోర్షన్స్ కంటే ముందు ఆదాయం)

*రెవ్లీమిడ్ ఔషధంపై సెల్‌జీన్‌తో సెటిల్మెంట్ ఒప్పందం వల్ల లభించే ఆదాయాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఒప్పందం వల్ల వచ్చే సొమ్ముతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం పైన పేర్గొన్న మొత్తం కంటే కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదే విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం నుంచి యూఎస్ మార్కెట్‌లో రెవ్లీమిడ్ ఔషధాన్ని సరఫరా చేసే వీలుంది కాబట్టి, ద్వితీయార్ధంలో ఆదాయాలు, లాభాలు పెరిగి నికర లాభం ఇంకా అధికంగా నమోదు కావచ్చు.

***2021-22 ఆర్థిక సంవత్సరంలో అగ్రోకెమికల్ వ్యాపారం ఆదాయాలు జత కలుస్తాయి. ఈ మేరకు ఆధాయాలు, లాభాల్లో వృద్ధికి అవకాశం ఉంది.

 

వాల్యుయేషన్, షేర్ ధర
నాట్కో ఫార్మా షేర్ 2017లో రూ. 1000కి పైగా ధర పలికి ఆ తర్వాత స్టాక్‌మార్కెట్‌ కరెక్షన్‌లో కిందకు వచ్చింది. గత రెండేళ్లుగా ఈ షేర్ రూ. 600కు అటూ ఇటూగా కన్సాలిడేట్ అయింది. గత రెండు వారాల్లోనే ఈ పాట్రన్ నుంచి బ్రౌకౌట్ తీసుకుని బలమైన నిరోధం అయిన రూ. 715 ధరను అధిగమించింది. గత నెల 31న రూ. 790 ధర (52 వారాల గరిష్ట ధర) పలికి రూ. 782 వద్ద ముగింపు ధర నమోదు చేసింది. ప్రస్తుతం 30పీఈ  (ట్రెయిలింగ్ ఈపీఎస్ ప్రకారం) లో ఈ షేర్ పలుకుతోంది. షేర్ ధర టెక్నికల్‌గా బ్రేకౌట్ సాధించడమే కాకుండా, గత రెండు వారాలుగా డెయిలీ ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. దీని ప్రకారం చూస్తే... ఈ షేర్ సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

కొవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా మందులకు మఖ్యంగా యాంటీ-వైరల్, హెచ్‌సీక్యూ (హైడ్రాక్సీ క్లోరోక్విన్), ఒసెల్టామివిర్... వంటి ఔషధాలకు విపరీతమైన గిరాకీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఔషధాల విభాగంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న కంపెనీల్లో నాట్కో ఫార్మా ఒకటి. ఫినిష్డ్ డోసేజెస్ (ట్యాబ్లెట్లు, కేప్సూల్స్, ఇంజెక్టబుల్స్) తో పాటు ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్) సైతం తయారు చేస్తున్న కంపెనీ కావడంతో ఏపీఐల కోసం ఇతర కంపెనీలపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం నాట్కో ఫార్మాకు లేదు. దీనికి తోడు కంపెనీకి విస్తృతమైన డ్రగ్ -పైప్ లైన్‌, అగ్రోకెమికల్ విభాగంలోకి ప్రవేశించడం, స్పెషాలిటీ డ్రగ్స్  పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునేందుకు ఆర్అండ్‌డీపై అధికంగా ఫోకస్ చేయడం.. వంటి సానుకూలతలు ఎటూ ఉన్నాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే వచ్చే రెండు నుంచి అయిదేళ్ల పాటు కంపెనీ ఆకర్షణీయమైన ఆదాయాలు, లాభాలు సంపాదించగలుగుతుందని స్పష్టవుతుంది.

 

ప్రస్తుత ఫార్మా ర్యాలీలో పెద్ద ఫార్మా కంపెనీలకు 35-40 పీఈ ఇచ్చేందుకు కూడా ఇన్వెస్టర్లు ముందుగు వస్తున్నారు. పైగా మరో ఆరు నెలల పాటు అయినా ఫార్మా ర్యాలీ ఉంటుందని అంచనా. ఈ ర్యాలీలో, నాట్కో ఫార్మా ఇప్పుడో పాలు పంచుకుంటోంది. అందువల్ల ఇక్కడి నుంచి కూడా 30- 35 శాతం షేర్ ధఱ పెరిగే అవకాశం ఉందని నమ్మకంగా చెప్పవచ్చు. పైగా డౌన్‌సైడ్ రిస్క్ ఎంతో తక్కువ. అందువల్ల ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలం ఓపిక పట్టగల మదుపరులకు నాట్కో ఫార్మా ఈ లెవెల్‌లో కూడా మంచి పెట్టుబడి అవకాశమే.