జులైలో షేర్ మార్కెట్ ర్యాలీ యావరేజ్ 7%

జులైలో షేర్ మార్కెట్ ర్యాలీ యావరేజ్ 7%

జులైలో షేర్ మార్కెట్ ర్యాలీ యావరేజ్ 7%

స్మాల్ అండ్ మిడ్ క్యాప్ గెయిన్ 5%
100కు పైగాBSE ఇండెక్స్ స్టాక్స్ 10-80శాతం పెరుగుదల
ఐటీ, ఫార్మా షేర్ల జోరు

జులైలో S&P BSE సెన్సెక్స్ మరియు నిఫ్టీ50లు 7శాతానికి పైగా ర్యాలీ నమోదుచేశాయి. మొత్తంగా మార్కెట్ చూస్తే.. గడిచిన నెల జులైలో S&P BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ మరియు S&P BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 5శాతానికి పైగా గెయిన్ అయ్యాయి. BSE500 ఇండెక్స్ లో వందకు పైగా స్టాక్స్ లో  10-80శాతం ర్యాలీ కనిపించింది. S&P BSE 500 లో 126 స్టాక్స్ 10-80శాతం ర్యాలీ అయ్యాయి. ఇందులో కాడిలా హెల్త్ కేర్, పీవీఆర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, M&M, డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్, హరిటేజ్ ఫుడ్స్, L&T ఇన్ఫోటెక్, లారస్ ల్యాబ్స్ ఉన్నాయి.  కొన్ని స్టాక్స్ అనూహ్యంగా హై వాల్యూషన్ వద్ద ట్రేడ్ అయ్యాయి. మరికొన్ని డీసెంట్ వాల్యూ చూపించాయి. జులై మార్కెట్ వర్గాలు. ఐటీ, హెల్త్ కేర్, ఎనర్జీలో 10శాతంపైగా గెయిన్ అయ్యాయి. ఇన్ ఫ్రా, యుటిలిటీస్, టెలికం. పవర్, కేపిటల్ గూడ్స్, రియాల్టీ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఏప్రిల్ 2020 నుంచి ఫార్మా రంగంపై ఇన్వెస్టర్లు భారీగా నమ్మకముంచారు. అటు ఐటీ రంగంలోనూ కంపెనీలు చూపించిన మెరుగైన ఆర్థిక ఫలితాలతో స్టాక్స్ భారీగా పెరిగాయి. యావరేజిగా 22.4శాతం గెయిన్ అయింది ఐటీ రంగం. ఇతర పెద్ద కంపెనీలు జులైలో ఒత్తిడిలో ఉన్నా.. రిలయన్స్, HDFC వంటి రెండు మూడు స్టాక్స్ పెద్ద ఎత్తున లాభాలు చూపించాయి. ట్రెండిగ్స్ జాగ్రత్తగా గమనించి మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకుని ముందుముందు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు.