IPOకు వచ్చే యోచనలో కల్యాణ్‌ జ్యూయెలర్స్‌

IPOకు వచ్చే యోచనలో కల్యాణ్‌ జ్యూయెలర్స్‌

గోల్డ్‌ జ్యూయలర్స్‌ రిటైల్‌ కంపెనీ కల్యాణ్‌ జువెలర్స్‌ IPOకు వస్తోంది. ఇష్యూకు సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టింది కంపెనీ. ఈ ఆగస్ట్‌ చివరిలో లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో సెబీ అనుమతులు కోరనుంది సంస్థ. కోవిడ్‌-19 వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారం పెరుగుతుందని ఆశాభావంతో ఉన్న కంపెనీ IPO నిర్ణయాన్ని వచ్చినట్టు తెలుస్తోంది. 

ప్రైమరీ , సెంకడరీ మార్కెట్లలో షేర్ల ఇష్యూ ద్వారా రూ.1,600-రూ.1,800కోట్ల నిధులను సమీకరించాలని చూస్తోంది సంస్థ. వాస్తవానికి కంపెనీ 2018లోనే ఐపీఓకు రావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది.  

యాక్సిస్‌ క్యాపిటల్‌, సిటి, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సెబీ క్యాపిటల్‌ మొదలైన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు ఐపీఓ కోసం పనిచేస్తున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చి డబ్బుతో అప్పుల భారం తగ్గించుకోవాలని కంపెనీ చూస్తోంది. అనుమతులు అన్నీ వచ్చి న తర్వాత జనవరిలో మార్కెట్లోకి వస్తుంది. ప్రస్తుతం కల్యాణ్‌ జువెలర్స్‌కు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 135 షోరూమ్‌లున్నాయి. 328 విక్రయశాలున్నాయి. అలాగే 5దేశాల్లో బ్రాంచులున్నాయి.