భారీ నష్టాలను మూటగట్టుకున్న టాటా మోటార్స్

భారీ నష్టాలను మూటగట్టుకున్న టాటా మోటార్స్

భారీ నష్టాలను మూటగట్టుకున్న టాటా మోటార్స్

నికరంగా నష్టాలు 8443 కోట్లు
42శాతం పడిపోయిన జాగ్వార్ అమ్మకాలు
2020-21 Q1 ఫలితాలు

దేశీయ ఆటోరంగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటర్స్ భారీ నష్టాలనే చవిచూసింది. 2020-21ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి 8443.98 కోట్ల నష్టాలను చూపించింది. లాక్ డౌన్ కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా సంస్థ వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో గత ఏడాది 2019-20 ఇదే కాలానికి 3679.66 కోట్ల నష్టాలను చూపించింది. గత సంవత్సరం ఈ నెలల కాలంలో కంపెనీ ఆపరేషనల్ ఆదాయం 61,467 కోట్లు కాగా.. ఈ ఏడాది కోవిడ్ కారణంగా 31,983.1 కోట్లకు పడిపోయింది.