డిజిటల్ ఫ్లాట్ ఫాంలో అమ్మకానికి ఇళ్లు

డిజిటల్ ఫ్లాట్ ఫాంలో అమ్మకానికి ఇళ్లు

డిజిటల్ ఫ్లాట్ ఫాంలో అమ్మకానికి ఇళ్లు

రియాల్టీ సంస్థలు ప్రయత్నాలు
2.7లక్షలకు పైగా రెడీ టు మూవ్ హౌసెస్ 
కరోనా కారణంగా స్లోడౌన్

డిజిటల్ ఫ్లాట్ ఫాం ద్వారా విక్రయాలపై ద్రుష్టిపెట్టాయి రియల్టీ సంస్థలు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 59శాతం తగ్గి కేవలం 26,379 యూనిట్లు మాత్రమే విక్రయాలు పరిమితం అయ్యాయి. దేశవ్యాప్తంగా టాప్ 8 ప్రాపర్టీ మార్కెట్లలో 9లక్షల 60వేల యూనిట్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రెడీ టూ మూవ్ 2లక్షల 70వేలకు పైగానే ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఎకానమీ స్లోడౌన్ అయింది. కంపెనీలు కాస్ట్ కటింగ్ అంటూ జాబ్స్ తీసేస్తున్నాయి. ఇదంతా రియల్ రంగంలో అమ్మకాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సంస్థలు. అటు ప్రభుత్వం నేషనల్ హౌసింగ్ బ్యాంకులోకి భారీగా నిధులు ఇన్ ఫ్యూజ్ చేస్తోంది. 25వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. అయినా అమ్మకాలు పెరగడం లేదు. అటు మార్కెట్ కాపాడుకుంటూనే కోవిడ్ నేపథ్యంలో క్రెడాయ్, నరెడ్కో ఆన్ లైన్ ద్వారా విక్రయాలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మిడిల్ క్లాస్, ఎఫెర్డ్ బుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా ద్రుష్టి సారించాయి. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఇప్పటికే Awaas పేరుతో పోర్టల్ ఏర్పాటుచేశారు. Housing For All పేరుతో ఇప్పుడు నారెడ్కో కూడా డిజిటల్ అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 1.21లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అందుబాటులో ఉంటాయి. ధరలు, సదుపాయాలతో పాటు సకల సమాచారం అందులో ఉంటుంది. ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు అందులో ఉంటాయి. కోవిడ్ నేపథ్యంలో పోర్టల్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా... విక్రయాలు జరిపేందుకు అనుకూలంగా ఉంటుందని నారెడ్కో చెబుతోంది. దీనిని ఇటీవలే అధికారికంగా లాంచ్ చేశారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.