సన్ ఫార్మాకు లీగల్ కేసులు తెచ్చిన నష్టాలు

సన్ ఫార్మాకు లీగల్ కేసులు తెచ్చిన నష్టాలు

సన్ ఫార్మాకు లీగల్ కేసులు తెచ్చిన నష్టాలు

Q1 ఫలితాలు వెల్లడించిన కంపెనీ
రూ.1656 కోట్లు నష్టం
అనుబంధ సంస్థ వల్లే అమెరికాలో కేసులు
వన్ టైం సెటిల్మెంట్ కోసం రూ.3వేల కోట్లు

ఫార్మాలో అతిపెద్ద సంస్థలో ఒకటైన సన్ ఫార్మా 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి 1655.6 కోట్ల నష్టాలు చవిచూసింది. లాభాలు తప్ప.. నష్టాలు లేని కంపెనీ తొలిసారిగా కష్టాల్లో పడింది. గత ఏడాది కూడా ఇదే కాలానికి 1387.5 కోట్ల లాభాలకు ప్రకటించింది. సన్ అనుబంధ సంస్థ టారో ఫార్మాస్యూటికల్స్ అమెరికాలో డ్రగ్ ప్రైస్ ఫిక్సింగ్ కేసులో వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకుంది. ఇందులో భాగంగా రూ.3178 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు లాస్ పెరిగింది. ఇవన్నీ కలిపి కంపెనీకి భారంగా మారాయి. దీంతో సబ్సడరీకి సన్ ఫార్మా 455.2 కోట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అటు కోవిడ్ లాక్ డౌన్ కారణంగా సన్ ఫార్మా పనితీరు కూడా నిరాశాజనకంగా ఉంది. సేల్స్ ఆదాయం గత ఏడాది కంటే 9.6శాతం తగ్గి 7467 కోట్లకు పరిమితం అయింది. అమెరికాలో కంపెనీ సేల్స్ 282 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అటు ఇతర దేశాల్లో కూడా గణనీయంగా సేల్స్ పడిపోయింది. అయితే ఇండియాలో మాత్రం అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. 3శాతం పెరిగాయి.