అంచనాలకు మించిన SBI. Q1లో 81శాతం పెరిగిన లాభాలు

అంచనాలకు మించిన SBI. Q1లో 81శాతం పెరిగిన లాభాలు

అంచనాలకు మించిన SBI

క్యూ1 ఆర్థిక ఫలితాల్లో జోష్ 
నికరలాభం రూ.3200
వాటాల విక్రయంతో రూ.1500 కోట్లు

ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ క్యూ1 ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. అనలిస్టుల అంచనాలను మించి లాభాలు ఆర్జించింది బ్యాంక్. గత ఏడాదితో పోల్చితే 81శాతం పెరిగి రూ.4189.34 నికరలాభాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలానికి 2312.20 కోట్లు మాత్రమే.
అయితే అనుబంధ కంపెనీ SBI life లో వాటా విక్రయం ద్వారా వచ్చిన రూ.1539.73 కోట్లు కూడా నికరలాభాల్లో చూపించింది. SBI Lifeలో కంపెనీవాటా 57.60 నుంచి 55.5కు పడిపోయింది. మార్కెట్‌ నికర లాభం అంచనాలు రూ.3200 కోట్లు కాగా.. అంతకుమించి లాభాలను సాధించింది. మొండిబకాయిలు- NPAలోనూ మెరుగైన పనితీరు కనబరిచింది. జూన్‌ క్వార్టర్‌లో బ్యాంక్‌ మొండి బకాయిల రూ.11వేల కోట్ల నుంచి రూ.8వేల కోట్లకు తగ్గాయి.  6.44శాతం నుంచి 5.శాతానికి తగ్గాయి. బ్యాంక్‌ ప్రోవిజన్‌ కవరేజ్‌ రేషియో 86శాతానికి చేరడం విశేషం.  వడ్డీ రూపంలో బ్యాంకు త్రైమాసికానికి 26,641 కోట్లు వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఇది 16.14శాతం పెరిగింది. ఇక ప్రోవిజన్స్ లో కూడా 36.13శాతం అధికంగా చూపించింది. ఈ ఏడాది రూ.12501 కోట్లు. మొత్తానికి బ్యాంక్ మెరుగైన ఫలితాలనే వెల్లడించింది.