లారస్‌ ల్యాబ్స్‌కు రిజల్ట్స్‌ బూస్టింగ్‌. 52 వారాల గరిష్టానికి షేర్‌ 

లారస్‌ ల్యాబ్స్‌కు రిజల్ట్స్‌ బూస్టింగ్‌. 52 వారాల గరిష్టానికి షేర్‌ 

అత్యత ఆకర్షణీయ ఫలితాలను లారస్‌ ల్యాబ్స్‌ ప్రకటించడంతో ఇవాళ ఈ కౌంటర్‌కు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. దీంతో లారస్‌ ల్యాబ్స్‌ 52 వారాల గరిష్ట స్థాయి రూ.933కి చేరింది. కంపెనీ ప్రారంభించాక అత్యధిక స్థాయిలో ఆదాయాలు, లాభాలు రావడంతో ఈ షేర్‌ ఇంట్రాడేలో 18శాతం పైగా లాభపడింది. 

జూన్‌ 29న రూ.517 వద్ద ట్రేడైన ఈ స్టాక్‌ నెల రోజుల వ్యవధిలో దాదాపు 80 శాతం రిటర్న్స్‌ అందించింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ 16శాతం పైగా లాభంతో రూ.920 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 78 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9030.44 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 33.11 కాగా, కంపెనీ పీ/ఈ 33.84గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.169.41, ఈపీఎస్‌ రూ.24.91గా ఉంది. 

రెండు రోజుల క్రితం మీ అభిమాన వెబ్‌సైట్‌ profityourtrade.in చెప్పింది అక్షరాలా నిజమైంది. లారస్‌ ల్యాబ్స్‌లో బంపర్‌ ఫలితాలు రానున్నాయని వెబ్‌సైట్‌లో పతాక శీర్షికలో మా రిసెర్చ్‌ టీమ్‌ కథనాన్ని అందించింది. సరిగ్గా ఆ కథనంలో చెప్పిన విధంగానే లారస్‌ ల్యాబ్స్‌ బంపర్‌ రిజల్ట్స్‌ను ప్రకటించింది. ముందుగా చెప్పిన విధంగానే ఈ స్టాక్‌ పరుగులు తీస్తూ సరికొత్త 52వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది.