మార్కెట్ల పరుగులు వెనక...! ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

మార్కెట్ల పరుగులు వెనక...! ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

మార్కెట్లు పరుగులు వెనక...!

నిరుద్యోగ శాతం డబుల్ డిజిట్ లో ఉంది
కరోనా తీవ్రత ఎంతకాలముంటుందో తెలియదు
అయినా మార్కెట్ల ర్యాలీ
రీజనేంటి? మార్కెట్ వెనక లాజిక్ ఏంటి?
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్


ఇండియాలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది. డబుల్ డిజిట్ స్థాయికి చేరుకుంది. రానున్న త్రైమాసికాల్లో కంపెనీల లాభాలు తగ్గుతాయని అంచనాలున్నాయి. కిల్లర్ వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. గ్రేట్ డిప్రెషన్ కంటే సీరియస్ అంటూ అమెరికా ప్రకటించింది. 2008 నాటి రెసిషన్ రిపీట్ అవుతుందని ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసింది. అయినా స్టాక్ మార్కెట్లలో ఇటీవల ర్యాలీ భీబత్సంగా కొనసాగుతోంది. ప్రపంచమార్కెట్లు మార్కెట్లు కళకళలాడుతున్నాయి. డే హయ్యస్ట్ ఫాలౌట్స్ లేవు. బయ్యర్స్ తగ్గలేదు. అమ్మకాల ఒత్తిడి కనిపించడం లేదు. యథావిధిగానే మార్కెట్లు షేర్ హోల్డర్స్ కు లాభాలను పంచుతున్నాయి.

మార్కెట్లలో...
2020 జనవరి 20న BSE 42,273 పాయింట్లు గరిష్ట స్థాయిని తాకింది. అప్పటికే వైరస్ వ్యాప్తి పెద్దగా లేదు. చైనాలో మాత్రమే కేసులున్నాయి. క్రమంగా కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ వచ్చింది. భయాలు మొదలయ్యాయి. మార్కెట్లో కూడా సెంటిమెంట్ స్టార్ట్ అయింది. మార్చి24న భారత ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో సన్సెక్స్ పతనం ఆరంభం అయింది. కొద్దిరోజుల్లోనే 40శాతం పడిపోయి.. 25,638కి వద్దకు చేరింది. గ్లోబల్ మార్కెట్లది ఇదే దుస్థితి. అమెరికా మార్కెట్ ఏకంగా ఫిబ్రవరి, మార్చి మధ్య 34శాతం పడిపోయింది. కానీ అనూహ్యంగా రెండునెలలుగా మార్కెట్లు కోలుకుంటున్నాయి. భారతీయ మార్కెట్ 50శాతం రికవరీ అయింది. ప్రస్తుతం 38వేలకు పైగా ట్రేడ్ అవుతోంది. త్వరలోనే జనవరి 20 గరిష్ట స్థాయిని చేరుకుంటుందని అంచనాలున్నాయి. దేశీయంగా ఇటీవల స్టాక్ మార్కెట్లో 30కి పైగా కంపెనీలు ఆల్ టైం హై లో ట్రేడయ్యాయి. అటు మెరికాలోనూ 43శాతం రికవరీ వచ్చింది.

కరోనా ఎఫెక్ట్ లేదా?
2008లో వచ్చిన అతిపెద్ద రెసిషన్ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ఇండియా సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఫ్రీ క్రైసిస్ పరిస్థితికి మార్కెట్లు రావడానికి 12-18 నెలల తీసుకున్నాయి మార్కెట్లు. అంతకంటే పెద్ద రెసిషన్ అని ప్రభుత్వాలు ప్రకటించినా మార్కెట్లో ప్రభావం లేదు. ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లపై నమ్మకం పెరిగింది. కేవలం 4 నెలల్లోనే మార్కెట్లు క్రైసిస్ ముందు స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే మొదట్లో వైరస్ గురించి పెద్దగా తెలియకపోవడం... గతానుభవాలు లేకపోవడం వల్ల పిబ్రవరిలో ఇన్వెస్టర్లు భయపడ్డారు. ఇటలీ, చైనాలో మరణాలు కలవరపెట్టాయి. అమెరికాలో పెరిగిన కేసులతో క్రైసిస్ వస్తుందని అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. కానీ ఇప్పుడు ఓ అంచనాకు వచ్చారు. వ్యాక్సిన్ తప్ప మరో మందు లేదని తెలిశాక సాధారణంగానే స్పందిస్తున్నారు ఇన్వెస్టర్లు. దీనికి తోడు ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీలు, కంపెనీలకు ఆర్థికంగా వెసులుబాట్లు కలిసొచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వాలు పూర్తిగా ఎకానమిపై ద్రుష్టిపెట్టాయి. అమెరికా వంటి దేశాలు క్వాంటటేటీవ్ ఈజింగ్ ద్వారా, ఇండియా ప్యాకేజీల రూపంలో బెయిల్ అవుట్ ప్రకటించడంతో మార్కెట్లలో సందడి మొదలైంది. అనలాక్ వల్ల ఎకానమి కోలుకుంటోంది. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. తమ డబ్బుకు ఎలాంటి ఢోకా లేదని నమ్ముతున్నారు. పెద్ద కంపెనీల్లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు క్యూకడుతున్నారు. ఇవన్నీ మార్కెట్లకు కలిసొచ్చాయి. 

భయాలేంటి?
మార్కెట్లలో కరెక్షన్ అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి 2020-21 లో కంపెనీల లాభాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆపరేషనల్ లాభాల కంటే... ఒప్పందాలు, రైట్స్ ఇష్యూస్ ద్వారా బ్యాలెన్స్ షీట్స్ మెరుగుపరుచుకుంటున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఎకానమీకి మంచిది కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో NPAలు 14.5శాతానికి పెరుగుతాయని భయాందోళనలున్నాయి. దీనికి తోడు కంపెనీల నిర్వహణా లాభాలు తగ్గితే ప్రమాదం కూడా ఉంది. ఇన్వెస్టర్స్ ద్వారా సంస్థలకు భారీగా కేపిటల్ ఆదాయం వస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో రియల్ ఇన్ కం తగ్డడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఆకలి. అసమానతలు పెరుగుతాయి.. అలా కాకుండా అటు నిరుద్యోగం పెరగకుండా.. కంపెనీలకు మేలుజరిగేలా బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఉండాలన్నది నిపుణుల వాదన. అలా చేయకపోతే షేర్ మార్కెట్లలో లాభాలు కొంతకాలమే వస్తాయి. జాబ్స్ పోతే రిటైల్ ఇన్వెస్టర్లు రాకపోవచ్చు. ఉన్న షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురి అవుతాయి. దీంతో సహజంగానే మార్కెట్లో భారీ కుదుపు వస్తుంది. సో.. రియల్ లాభాలకు.. కేపిటల్ లాభాలకు మధ్య సమన్వయం అవసరం... లేదంటే మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతుంది.