హైదరాబాద్ కు చెందిన ఫార్మాలో అడ్వాంట్ కు మెజార్టీ వాటా

హైదరాబాద్ కు చెందిన ఫార్మాలో అడ్వాంట్ కు మెజార్టీ వాటా

హైదరాబాద్ కు చెందిన ఫార్మాలో అడ్వాంట్ కు మెజార్టీ వాటా

RA Chemలో వాటా దక్కించుకున్న PE అడ్వాంట్
రూ.వెయ్యి కోట్లకు పైగా డీల్

హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ RA Chemలో మెజార్టీ వాటా విక్రయించింది సంస్థ. ప్రముఖ గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ అడ్వాంట్ ఇంటర్నేషనల్ కంపెనీతో డీల్ కుదిరింది. కంపెనీ మెజార్టీ వాటా దక్కించుకోవడం ద్వారా పూర్తిగా నియంత్రించే అవకాశం వచ్చింది. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీయే RA Chemను 2003లో ఏర్పాటు చేసింది. యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడెంట్స్ -API విభాగంలో ఉంది. నాలుగు ఉత్పత్తి కేంద్రాలతో పాటు.. రెండు R&D సెంటర్స్ ఉన్నాయి. ఫార్మా రంగంలో అడ్వాంట్ కంపెనీ ఫార్మా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. గడిచిన 12 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 6 ఫార్మా కంపెనీల్లో 1.7బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలోనూ ఇన్వెస్ట్ చేసింది. ఇండియాలోనూ వివిధ రంగాల్లో కూడా 700 మిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకుంది. తాజా నిర్ణయంతో దేశీయంగా API లో RA Chem అగ్రగామి సంస్థగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తామంది కంపెనీ. తమకున్న వనరులతో కంపెనీ ఉత్పత్తి, రీసెర్చ్ విభాగంలో మరింత ముందుకు తీసుకెళతామంటోంది కంపెనీ.