రుణాలు తగ్గించేందుకు టాటా పవర్ ప్లాన్

రుణాలు తగ్గించేందుకు టాటా పవర్ ప్లాన్

రుణాలు తగ్గించేందుకు టాటా పవర్ ప్లాన్ 

పేరుకపోయిన అప్పులు
ఏడాది చివరినాటికి సగం తీర్చే యోచన
ప్లాన్ వెల్లడించిన కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్

టాటా పవర్ కంపెనీకి అప్పులు వెంటాడుతున్నాయి. అయితే ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్ల లోపు అప్పులకు పరిమితం చేయాలని టాటా పవన్ టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీకి రూ.48,376 కోట్ల రుణాలున్నాయి. 31 మార్చి నాటికి నెట్ రూ.43,559 కోట్ల అప్పులను చూపించింది టాటా పవర్. 2017నాటికే 49వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇటీవల స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ ఏడాది సగానికి తగ్గించడానికి స్పష్టమైన విధానంతో అడుగులు వేస్తున్నట్టు కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వెల్లడించారు. నాన్ కోర్ అసెట్స్ అమ్మకం ద్వారా రూ.2వేల కోట్ల వరకూ సమీకరించనున్నట్టు తెలిపారు. రెన్యుబుల్ బిజినెస్ ట్రాన్స్ఫర్ ద్వారా టాటా సన్స్ నుంచి మరో రూ.2600 కోట్లు రానున్నాయి. ఇతర మార్గాల్లోనూ నిధులు సమీకరించి అప్పులు సగానికి తగ్గిస్తామన్నారు కంపెనీ ఛైర్మన్.