ముగిసిన శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ రైట్స్ ఇష్యూ

ముగిసిన శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ రైట్స్ ఇష్యూ

1500 కోట్ల రైట్స్ ఇష్యూ చేసిన శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్

తగ్గిన కంపెనీ లాభాలు
స్వల్పంగా పెరిగిన ఆదాయం
రైట్స్ ఇష్యూకు 1.61 టైమ్స్ సబ్ స్కిప్షన్

కమర్శియల్ వెహికిల్ ఫైనాన్స్ సంస్థ శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ గురువారం విజయవంతంగా రైట్స్ ఇష్యూ క్లోజ్ చేసింది. మొత్తం 1.61 రెట్లు సబ్ స్క్రిప్షన్ వచ్చింది. రూ.1500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా రైట్స్ ఇష్యూకు వచ్చింది కంపెనీ. మొత్తం 2.61 కోట్ల షేర్స్ పెట్టగా 4.22 కోట్లకు బిడ్లు వచ్చాయి. షేర్ ధరను రూ.570గా నిర్ణయించింది కంపెనీ. శ్రీరామ్ ట్రాన్స్ పోర్టు 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ గణనీయంగా తగ్గిపోయింది. అంతకుముందు ఏడాది చివరి త్రైమాసికానికి రూ.746.04 కోట్ల నెట్ ప్రాఫిట్ చూపించగా... ఈ ఏడాది రూ.223.38 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం కంపెనీ ఆదాయం స్వల్పంగా పెరిగింది. రూ.3883 కోట్ల నుంచి రూ.4173 కోట్లకు చేరింది. దేశీయంగా చాలాకంపెనీలు రైట్స్ ఇష్యూకు వస్తున్నాయి. కరోనా కారణంగా నష్టాలపాలైన కంపెనీలు బ్యాలెన్స్ షీట్ సరిచేసుకోవడానికి ఇదో మార్గంగా ఎంచుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామ్ ట్రాన్స్ పోర్టు కూడా రైట్స్ ఇష్యూకు వచ్చింది. అరవింద్ ఫ్యాషన్స్ కూడా జులైలో 400 కోట్లు సమీకరించింది. పీవీఆర్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్, గేట్ వే డిస్ట్రీపార్క్స్ సహా పలు కంపెనీలు రైట్ ఇష్యూకు వచ్చాయి.