అందరి అంచనాలు తారుమారు చేసేసిన రిలయన్స్ క్యూ1

అందరి అంచనాలు తారుమారు చేసేసిన రిలయన్స్ క్యూ1

అంచనాలను దాటిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL)
త్రైమాసికంలో 31శాతం లాభాలు
రూ.13,248 కోట్లు నెట్‌ ప్రాఫిట్‌

దేశంలోనే అతిపెద్ద లిస్టెడ్‌ కంపెనీ RIL 2020-21ఆర్థిక  సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌  తొలి త్రైమాసానికి ఫలితాలు విడుదల చేసింది. రూ.13,248 కోట్ల నికర లాభాలను ఆర్జించింది కంపెనీ. ఎక్సప్షనల్‌  ఇన్‌కం రూ.4,966 కోట్లుగా చూపించిది. గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ రూ.10,141 కోట్ల లాభాలను చవిచూసింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ ఏడాది 31శాతం  పెరిగింది.

 

కంపెనీకి మొత్తం ఈ మూడునెలల కాలంలో అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.88,253 కోట్లు. వాస్తవానికి కంపెనీ లక్ష కోట్ల టర్నొవర్‌ సాధించి రూ.7వేల 118 కోట్లు నెట్‌ ప్రాఫిట్‌ ఆర్జిస్తుందని ఆర్ధికవేత్తలు, వివిధ సంస్థలు అంచనా వేశాయి. కానీ 11 సంస్థలు ఇచ్చిన విశ్లేషణలకు భిన్నంగా అంచనాలు మించి అనూహ్యంగా భారీ లాభాలు ఆర్జించింది సంస్థ.

 

RIL రిఫైనింగ్‌ కాస్ట్‌ గణనీయంగా తగ్గించింది. గత ఏడాది బ్యారెల్‌కు 8.9డాలర్లు కాగా... ఈ త్రైమాసికంలో ఇది కేవలం 6.3డాలర్లకు తగ్గింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆదాయం లాగే షేర్ కూడా మార్కెట్లో మంచి లాభాలు తెస్తోంది. ప్రస్తుతం కంపెనీ షేర్‌ రూ.2108.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 2020 ఇప్పటివరకూ 39శాతం పెరిగింది. ఒక్క జూన్‌ మాసంలో షేర్‌ 54శాతం గ్రోత్‌ నమోదుచేసింది.