అత్యంత ఆకర్షణీయంగా లారస్ ల్యాబ్స్ ఫలితాలు

అత్యంత ఆకర్షణీయంగా లారస్ ల్యాబ్స్ ఫలితాలు

 

రెండు రోజుల క్రితం "ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్" ఏం చెప్పిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి...

* లారస్ ల్యాబ్స్ బంపర్ ఫలితాలు? అని మా వెబ్‌సైట్లో పతాక శీర్షికల్లో ఇచ్చాం. కంపెనీ పెట్టిన ర్వాత ఎన్నడూ రానంత అధికంగా, అత్యంత ఆకర్షణీయమైన స్థాయిలో ఆదాయాలు, లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదు కాబోతున్నాయని స్పష్టంగా చెప్పాం. మా అనలిస్టుల బృందం, ఎంతో శోధించి, ఫార్మా రంగం తీరుతెన్నులను, కంపెనీ పనితీరును కూలంకషంగా విశ్లేషించి ఆదాయాలపై ఒక అంచనాకు వచ్చిందని వివరించాం.Laurus Labs-Aspen Pharmacare launch HIV drug in South Africa ...

* కరెక్ట్‌గా మేం ఏం చెప్పామో.. అక్షరాలా అదే జరిగింది!!!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం లారస్ ల్యాబ్స్ రికార్డ్ స్థాయిలో రూ. 172 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. త్రైమాసిక ఆదాయం కూడా రూ. 981 కోట్లు నమోదైంది. త్రైమాసిక ఈఫీఎస్ రూ. 1607 నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ. 555 కోట్లు, ఈపీఎస్ రూ. 1.42 మాత్రమే కావడం గమనార్హం.

దీంతో పోల్చితే ప్రస్తుత మొదటి త్రైమాసికానికి ఆదాయం దాదాపు రెట్టింపు కాగా నికర లాభం అయితే అత్యంత ఆకర్షణీయంగా నమోదైంది. ఈ ఫలితాలను లారస్ ల్యాబ్స్ బోర్డ్ డైరెక్టర్ల సమావేశం ఈ నెల 30న మధ్యాహ్నం వెల్లడించింది.

త్రైమాసిక ఆదాయం రూ. 900 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య ఉండబోతోందని 'ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్' వెల్లడించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. (ఒకసారి మా వెబ్‌సైట్లోకి వెళ్లి టాప్ స్టోరీస్ శీర్షిక కింద ఉన్న 'లారస్ ల్యాబ్స్ బంపర్ ఫలితాలు?' కథనాన్ని మరొకసారి చూడండి)

కొవిడ్-19 సవాళ్లు, లాజిస్టిక్స్ సమస్యలు, ముడిపదార్ధాల కొరత వండి సమస్యలు ఎదురైనప్పటికీ మొదటి త్రైమాసికంలోనే ఇటువంటి పనితీరు కనబరిస్తే, ఇక రెండో త్రైమాసికంలో... ఆ తర్వాత మిగిలిన త్రైమాసికాల్లో కంపెనీ ఎంత మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందో... అనే ఆలోచన రాకమానదు.

మొదటి త్రైమాసికం ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి దాదాపు రూ. 3500 కోట్ల నుంచి రూ. 4000 కోట్ల మధ్య ఆదాయం నమోదవుతుందని అనుకోవచ్చు. అదే విధంగా వార్షిక నికర లాభం రూ. 500 కోట్లను మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీని ప్రకారం చూస్తే వార్షిక ఈపీఎస్ రూ. 50 కంటే పైనే నమోదవుతుంది.

ఈ ఫలితాల ప్రకటన వెలువడిన వెంటనే లారస్ ల్యాబ్స్ షేర్‌కు ఇన్వెస్టర్ల నుంచి విశేష మద్దతు లభించింది. ట్రేడింగ్ మరో అరగంటలో ముగుస్తుందనగా... అంటే దాదాపు 3 గంటలకు ఆర్థిక ఫలితాలు బీఎస్ఈ వెబ్‌సైట్లో కనిపించాయి. అప్పుడు రూ. 767 వద్ద ఉన్న షేర్ ధర ఆ తర్వాత ఒక్కసారిగా శరవేగంగా పెరిగింది. చివరకు రూ. 799 వరకూ షేర్ ధర పెరిదింది. ఎన్ఎస్ఈలో 48.92 లక్షల షేర్లు, బీఎస్ఈలో 2.45 లక్షల షేర్ల ట్రేడింగ్ వాల్యూమ్ నమోదైంది. ఇంత అధిక వాల్యూమ్ ఈ కౌంటర్‌లో నమోదు కావడం కూడా మరొక రికార్డు.
 

కాంట్రాక్టు తయారీ ఆదాయాలు పెరిగాయి...
* లారస్ ల్యాబ్స్‌కు మొదటి త్రైమాసికంలో ఐరోపా దేశాల నుంచి కాంట్రాక్టు తయారీ ఆదాయాలు బాగా పెరిగాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా కాంట్రాక్టు తయారీ ఆర్డర్లు చేతిలో ఉండడం. కరోనా వైరస్ వ్యాధిని నివారించే శక్తి మలేరియా ఔషధమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ఉందని తొలినాళ్లలో విశ్వసించడంతో అమెరికాలో ఈ ఔషధానికి విశేష గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో ఈ ఔషధాన్ని అమెరికాలో లారస్ ల్యాబ్స్ విక్రయిచింది. అమెరికాలో ఇతర ఔషధాలను అధికంగా విక్రయించడంతో ఆదాయాలు, లాభాలు పెరిగే అవకాశం ఏర్పడింది.

* సింథసిస్- ఇన్‌గ్రేడియంట్స్ విభాగంలో ఈ త్రైమాసికంలో 37 శాతం వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో కంపెనీకి అధిక సంఖ్యలో ప్రాజెక్టులు ఉండం ఆకర్షణీయమైన విషయం.

* దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా సింథసిస్ వ్యాపార కార్యకలాపాల కోసం 100 శాతం సబ్సిడరీ కంపెనీగా లారస్ సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను లారస్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది.

* కరోనా వైరస్ వ్యాధి ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా యాంటీ-వైరల్ ఔషధాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో యాంటీ-వైరల్ ఔషధాల విభాగంలో లారస్ ల్యాబ్స్ ఈ త్రైమాసికంలో అధిక అమ్మకాలు సాధించింది. అంతేగాకుండా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వైరల్ ఔషధాల విభాగంలో అమ్మకాలు ఆకర్షణీయంగా ఉంటాయని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది,

* ఈ ఏడాది జూన్ 30 నాటికి కంపెనీ 262 పేటెంట్ల దరఖాస్తులు దాఖలు చేయగా, ఇందులో 121 పేటెంట్లు లభించాయి.

 

Laurus Labs: A hot startup in the pharma sector « Pharmachitchat

దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళిక

"ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికాన్ని ఆకర్షణీయమైన వృద్ధితో ప్రారంభించాయం. కొవిడ్-19 సవాలు ఎదురైనప్పటికీ 77 శాతం త్రైమాసిక వృద్ధి నమోదు చేయగలిగాం. ఎబిటా (ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్స్, డిప్రిసియేషన్, అపోర్షన్స్) రెండు రెట్లు పెరిగింది. ఫార్ములేషన్ల విభాగం, సింథసిస్ వ్యాపారం, యాంటీవైరల్ విభాగాలు ఎంతో అధిక పనితీరు కనబరిచాయి. అన్ని విభాగాల్లో ఇదే విధంగా మున్ముందు మెరుగైన పనితీరు కనబరచగలమని నాకు విశ్వాసం ఉంది. దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నాం."
-లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ చావ సత్యనారాయణ
 

షేర్ల విభజన
ప్రస్తుతం లారస్ ల్యాబ్స్ ఈక్విటీ షేర్ ముఖ విలువ రూ. 10 కాగా, దీన్ని రూ. 2 ముఖ విలువ కల అయిదు షేర్లుగా విభజించాలని కంపెనీ యాజమాన్యం ప్రతపాదించిన విషయం తెలిసిందే. దీనికి ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదార్ల అనుమతి లభించింది. ఇక రికార్డు తేదీ నాటికి షేర్ల విభజన జరుగుతుంది. గురువారం నాడు జరిగిన లారస్ ల్యాబ్స్ బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీని 'రికార్డు తేదీ'గా ప్రకటించారు. అప్పటికి ఒక షేరు కాగా... అది అయిదు షేర్లు అవుతుంది. షేర్‌హోల్డర్ల డీమ్యాట్ ఖాతాల్లో ఆటోమ్యాటిక్‌గా ఈ మార్పు జరిగిపోతుంది. 1 షేరు స్థానంలో, 5 షేర్లు జమ అవుతాయి. షేర్ల విభజన వల్ల చిన్న ఇన్వెస్టర్లకు షేర్ ధర అందుబాటులోకి వచ్చి  కొనుగోలుదారుల సంఖ్య పెరిగి, లిక్విడిటీ అధికం అవుతుంది. అంతేగా కంపెనీ పనితీరు ఆధారంగా షేర్ ధర అక్కడి నుంచి త్వరగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.