అంచనాలను అధిగమించిన హెచ్‌డీఎఫ్‌సీ

అంచనాలను అధిగమించిన హెచ్‌డీఎఫ్‌సీ

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఆర్థిక ఫలితాలు అంచనాలను అధిగమించాయి. జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికరలాభం 4.7 శాతం క్షీణతతో రూ.3051.5 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.3203.10 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం రూ.12990.3 కోట్ల నుంచి రూ.13,017.7 కోట్లకు ఎగబాకింది. 

నికర వడ్డీ ఆదాయం(NII) 10.17 శాతం వృద్ధితో రూ.3392 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం రూ.3079 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ (NIM) 3.3శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది. కోవిడ్‌-19 ప్రొవిజన్స్‌ రూ.1199 కోట్లుగా ఉంది. 

మారటోరియం-2 లో వ్యక్తిగత రుణాలు 16.6 శాతంగా ఉన్నాయని, మారటోరియం-1లో ఇవి 22.6 శాతంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీకి సరిపడా లిక్విడిటీ పొజిషన్స్‌ ఉన్నాయని, డిపాజిట్లలో 26శాతం వృద్ధిని నమోదు చేసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. 

జూన్‌ 30 వరకు హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (AUM) రూ.5,31,555 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో AUM రూ.4,75,933 కోట్లుగా ఉన్నాయి. మొత్తం AUMలో వ్యక్తిగత రుణాల వాటా 74 శాతంగా ఉంది. AUM ప్రాతిపదికన ఇండివిడ్యువల్‌ లోన్‌ బుక్‌ 11 శాతం వీధ్ధిని నమోదు చేయగా, వ్యక్తిగతేతర రుణ వృద్ధి 15శాతంగా ఉందని బ్యాంక్‌ తెలిపింది. ఇక మొత్తం లోన్‌ బుక్‌లో వృద్ధి 12శాతంగా నమోదైంది.