లాభాల్లో కొనసాగుతోన్న సెన్సెక్స్‌, నిఫ్టీ

లాభాల్లో కొనసాగుతోన్న సెన్సెక్స్‌, నిఫ్టీ

హెవీ వెయిట్‌ స్టాక్స్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ రిజల్ట్స్‌ ఇవాళ వెలువడనుండటంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లు లాభాల్లో కదలాడుతోన్నాయి. ఐటీ, టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ కౌంటర్లు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 38300 ఎగువన ట్రేడవుతోండగా, 70 పాయింట్ల లాభంతో 11272 వద్ద నిఫ్టీ కొనసాగుతోంది. 

జూలై ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌ ఇవాళ్టితో ముగియనుండటంతో ట్రేడర్లు ఆచితూచి ట్రేడింగ్‌ చేస్తున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 4.02 శాతం, విప్రో 2.73శాతం, టీసీఎస్‌ 2.27శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 2.12 శాతం, అదాని పోర్ట్స్‌ 1.98 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్‌ 4.58 శాతం, ఐఓసీ 2.81 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.98శాతం, గెయిల్‌ 0.86 శాతం, కోటక్‌ మహీంద్రా 0.76 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

Nifty Bank
22177.80    101.20    +0.46%

Nifty IT
18168.30    287.80    +1.61%

BSE SmallCap
13053.50    81.15    +0.63%

BSE MidCap
13807.27    44.72    +0.32%

Nifty Auto
7377.40    47.15    +0.64%

BSE Cap Goods
12862.80    39.74    +0.31%

BSE Cons Durable
21596.43    143.24    +0.67%

BSE FMCG
11490.19    25.61    +0.22%

BSE Healthcare
17602.32    274.71    +1.59%

BSE Metals
7862.80    11.66    +0.15%

BSE Oil & Gas
13443.39    -130.15    -0.96%

BSE Teck
8929.37    131.58    +1.50%

Nifty PSE
2537.90    -25.50    -0.99%