తెలుగు సినిమా హీరోలూ,

తెలుగు సినిమా హీరోలూ,

కరోనా సమయంలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్థలు ప్రజలకు అనేక విధాలుగా సేవలు అందిస్తున్నాయి. కానీ సామాన్య ప్రజల అభిమానంతో, వారు కొనే సినిమా టికెట్ మీద ఆధారపడి కోట్ల రూపాయల పారితోషికంతో ఆస్తులు పెంచుకున్న సినిమా (ముఖ్యంగా తెలుగు) హీరోలు మాత్రం నోటికి మాస్కు వేసుకుని మౌనవ్రతం చేస్తున్నారు పైగా "అందరు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలంటూ" పైసా ఖర్చులేని ఉచ్చిత సలహాలు మాత్రం ఇస్తున్నారు. వారికి తమ వ్యాపారాలు విస్తరింపచేసుకోవటం మీద ఉన్న శ్రద్ద, వారికి కోసం ప్రాణాలు అర్పించే అభిమానులమీద ఏ మాత్రం సానుభూతి ఉండదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటె, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ, వ్యాపారాలకు స్థలాలు, స్టూడియో లకు భూములంటూ వారి చుట్టూ ప్రదక్షణాలు చేయటం తప్ప ప్రజలకు సేవ చేసిన ఆనవాళ్లు ఎక్కడా కనపడవు.

     ఈ మధ్య మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు "సోనూ సూద్" ఇతను తెరమీద విలన్ వేషాలు వేసినా, నిజజీవితంలో ఈ తెరమీద హీరోలకే, హీరో అయ్యాడు. కరోనా సమయంలో  వివిద దేశాలలో చిక్కుకున్న వలస కూలీలను, విద్యార్థులను  వారిని తన సొంత ఖర్చుతో వారి సొంత ప్రాంతాలకి తరలించడంలో కానీ, ఎవరైనా కష్టంలో ఉన్నారని తన దృష్టికి వచ్చిన తక్షణమే సహాయం చేసే పద్దతి కానీ, పేదవారిని చదివించటంలో ఇలా సమాజ సేవలో హీరో అయ్యారు. ప్రజలు ఇతన్ని ఇప్పుడు "రియల్ హీరో" అంటున్నారు. సోనూ సూద్ లాంటి వారి నుండి ఇప్పటికి స్ఫూర్తి పొందని, స్పందించని, చలనం లేని, మనం కొనే టిక్కెట్టు మీద ఆధారపడి పడి బ్రతికే ఈ సినిమా హీరోలను ఇంకా అభిమానించటం, ఆదరించటం అవసరమా అని సగటు ప్రేక్షకుడి ప్రశ్న ..!