లారస్ ల్యాబ్స్ బంపర్ ఫలితాలు?

లారస్ ల్యాబ్స్ బంపర్ ఫలితాలు?

హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ లారస్ ల్యాబ్స్ బంపర్ ఫలితాలు ప్రకటించబోతోందా?
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఇంతకు ముందెన్నడూ లేని, కంపెనీ పెట్టిన తర్వాత నమోదు కాని స్థాయిలో అత్యధిక నికరలాభాన్ని ప్రకటించబోతోందా?
స్టాక్ మార్కెట్లో జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తే... అటువంటిదేదో జరగబోతోందనే అనిపిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించే నిమిత్తం లారస్ ల్యాబ్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఈ నెల 30న జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ సమయం ముగిసే లోపుగానే ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలుగుచూడవచ్చు. USFDA approved Laurus Labs HIV drugవిశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్రైమాసిక నికరలాభం ఎంతో అధికంగా ఉండబోదోందని తెలుస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి 2020) కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రికార్డు స్థాయిలో రూ. 840 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ. 110 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ. 10.32 వద్ద నమోదైంది. మొత్తం మీద చూస్తే 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి... కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఆదాయం రూ. 2837 కోట్లు, నికర లాభం రూ. 255 కోట్లు, ఈపీఎస్ రూ. 23.93గా ఉన్నాయి.

కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ఈ రికార్డులన్నింటినీ మించిపోయే ఫలితాలు నమోదవుతాయని అంటున్నారు.

కంపెనీకి చెందిన నాలుగు ప్లాంట్లలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది-ఏడాదిన్నర కాలానికి సరిపడా స్థాయిలో కంపెనీకి ఔషధ సరఫరా ఆర్డర్లు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

"మేమంతా పూర్తి స్థాయిలో పని చేస్తున్నాం. కంపెనీ పెట్టిన తరువాత ఇంత మెరుగైన స్థితి గతంలో ఎన్నడూ లేదు. చేతి నిండా ఆర్డర్లు - చేతి నిండా పని. ఇదీ ఇప్పుడు మా కంపెనీ పరిస్థితి." అని లారస్ ల్యాబ్స్ సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లుగానే మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో  (క్యూ4, 2020) రూ. 110 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు పైన చెప్పుకున్నాం. ఈ ఏప్రిల్-జూన్ (క్యూ1, 2021) త్రైమాసికంలో ఇంతకంటే కనీసం 20 శాతం అధికంగా నికర లాభం నమోదవుతుందని స్టాక్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Laurus Labs share price: Trending stocks: Laurus Labs shares rise ...అదే విధంగా త్రైమాసిక ఆదాయం రూ. 900 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇంత భారీ అంచనాలు ఉన్నందునే స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లతో నిమిత్తం లేకుండా గత కొన్ని రోజులుగా లారస్ ల్యాబ్స్ షేర్ ధర పెరుగుతూనే వస్తోంది. దాదాపు ప్రతి రోజూ '52 వీకై హై...' ధర నమోదవుతోంది.

ఈ మంగళవారం... అంటే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి ఇంకా రెండు రోజుల ముందే బీఎస్ఈలో లారస్ ల్యాబ్స్ షేర్ ధర గరిష్టంగా రూ. 765ను తాకింది. చివరకు రూ. 760 వద్ద ముగింపు ధర నమోదైంది. ఈ ఏడాది మే నెల మొత్తం ఈ షేర్ రూ. 450 దరిదాపుల్లోనే ఉండిపోయింది. జూన్ నెల 10వ తేదీ నుంచి పెరగడం మొదలైంది. జూలై నెల మొదటి నుంచి ఎంతో చురుకుగా ఉండడంతో పాటు పెద్ద ఎత్తున 'ట్రేడింగ్ వాల్యూమ్' నమోదవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆర్థిక ఫలితాల ప్రకటనకు బోర్డ్ సమావేశం తేదీని ప్రకటించారో... ఇక అప్పటి నుంచి పట్టపగ్గాల్లేకుండా రోజూ పెరుగతూ రూ. 750 ధర కంటే మించిపోయింది. 

స్టాక్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నట్లుగా మొదటి త్రైమాసికానికి ఆకర్షణీమైన స్థాయిలో ఆదాయాలు, లాభాలు ప్రకటించిన పక్షణంలో షేర్ ధర ఇంకా పెరుగుతుందని ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం రూ. 10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌ను రూ. 2 ముఖ విలువ గల 5 షేర్లుగా విభజించాలని కూడా కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. Laurus Labs Vizag unit completes USFDA inspectionదీనికి ఇటీవల జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదముద్ర కూడా లభించింది. ఈ నెల 30న జరగబోయే డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఆర్థిక ఫలితాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు షేర్ల విభజన అంశాన్ని కూడా పరిశీలించి రికార్డు తేదీ నిర్ణయిస్తే... ఈ షేర్‌కు ఇంకా ఆకర్షణ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ... ప్రస్తుత కరోనా కాలం ఫార్మా కంపెనీలకు అనూహ్యమైన వ్యాపారావకశాన్ని కల్పిస్తే, లారస్ ల్యాబ్స్‌కు ఇంకెంతగానో కలిసి వచ్చిందని చెప్పాలి. కంపెనీ పనితీరు అనూహ్యంగా మెరుగుపడడం, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లను ఆకర్షించడం, షేర్ ధర పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటికే రూ. 8000 కోట్లకు మించిపోవడం... ఇవన్నీ ఆసక్తికరమైన పరిణామాలు. మొత్తం మీద హైదరబాద్ నుంచి ప్రస్తుత సీజన్లో స్టార్ షేర్ ఏదైనా ఉందంటే, ఇది లారస్ ల్యాబ్స్ అనే చెప్పాలి.