మరో ఉద్దీపనకు వేళయిందా?

మరో ఉద్దీపనకు వేళయిందా?


మరో ఉద్దీపనకు వేళాయా? 

ప్రభుత్వాన్ని కోరుతున్నపారిశ్రామికవర్గాలు
సానుకూలంగా సంకేతాలు!
కోలుకుంటున్న ఎకానమీకి బూస్ట్!

కోవిడ్ నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వం రెండోవిడత ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే మాగ్జిమం ఇంపాక్ట్ ఉంటుందని పారిశ్రామికవర్గాలంటున్నాయి. ఇప్పటికే ఇదే విషయం ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాయి పారిశ్రామిక, వ్యాపారవర్గాలు. 

సానుకూలంగా ప్రభుత్వం..
మలిదశ ప్యాకేజీకి ప్రభుత్వం కూడా సానుకూలంగా సంకేతాలు ఇస్తోంది. కోవిడ్ క్రైసిస్ తర్వాత ఎకానమీ గ్రాడ్యువల్ గా రికవరీ అవుతుందని.. సరైన సమయంలో మరో ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆర్ధిక శాఖలోని కీలక అధికారులు చెబుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టామని.. మార్కెట్ స్పందించే విధానం బట్టి ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ముందుముందు ఉద్దీపన ప్యాకేజీలు ఉండవని కొట్టిపారేయలేదు మంత్రి. కరోనా క్రైసిస్ నుంచి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని గత వారం నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారులు కె. సుబ్రహ్మణియన్ ఇప్పటికే ప్రకటించారు.

ఇదే సరైన సమయం..
దేశంలో కరోనా కేసులు 1.5 మిలియన్ టచ్ అవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడోస్థానంలో ఉంది ఇండియా. అదేసమయంలో రికవరీ రేటు కూడా ఇతర దేశాలతో పోల్చితే 9లక్షలమందికి తగ్గి 63.92శాతంతో మెరుగ్గా ఉంది. అయినా కరోనా సంక్షోభం నుంచి ఇప్పట్లో బయటపడటం కష్టమే.. ఇందులో భాగంగానే అమెరికా మరోసారి ఉద్దీపన ప్యాకేజీకి సిద్దమవుతోంది. భారతీయ పారిశ్రామిక, వ్యాపారవర్గాలు కూడా బెయిల్అవుట్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాయి. అన్ లాక్ కారణంగా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. GST, రైల్వే ఫ్రైట్ ఆదాయం పెరుగుతోంది. సో.. ఉద్దీపన ప్యాకేజీ ఇస్తే అన్ని మార్కెట్లో ఇంకాస్త డిమాండ్ పెరిగి.. ఉత్పత్తి రంగం కూడా గాడిలో పడుతుందని CII వర్గాలంటున్నాయి. ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని మౌలిక రంగాల్లో నిధులు వెచ్చించడంతో పాటు.. వ్యాపారసంస్థలకు ఉన్న బకాయిలు మొత్తం వెంటనే చెల్లిస్తే ఎకానమీకి బూస్ట్ ఇచ్చినట్టువుతుంది. అంతిమంగా ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడుతుందని CII ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఇచ్చిన 20లక్షల కోట్ల ప్యాకేజీ చిరు వ్యాపారులకు, నాన్ బ్యాంకింగ్ రంగానికి ఉరటనిచ్చింది. గ్రామాల్లో పేదలకు ఉపాధి అవకాశాలు స్రుష్టించింది. ఇప్పుడు జీడీపీలో 1శాతం మరో ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వగలిగితే పరిస్థితులు చక్కబడతాయంటున్నారు. బెయిల్ అవుట్ తో పాటు... కీలక నగరాల్లో అన్ లాక్ తో సహజంగానే ఎకనామిక్ యాక్టివిటి మెరుగుపడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో... మరోవిడత ఉద్దీపన ప్యాకేజీ కొట్టిపారేయలేదు ప్రభుత్వం. ఆశగా చూస్తుంది ఇండియా ఇంక్. చూద్దాం.. మోదీ మనసులో ఏముందో?