మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ REIT.. అప్లయ్‌ చేయదగ్గ ఐపీఓ

మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ REIT.. అప్లయ్‌ చేయదగ్గ ఐపీఓ

ఇష్యూ పరిమాణం : రూ.450 కోట్లు
ప్రైస్‌ బ్యాండ్‌ : రూ.274-275
ఇష్యూ ప్రారంభం : జూలై 27
ఇష్యూ ముగింపు : జూలై 29
కనీస దరఖాస్తు : 200 యూనిట్లు

దేశంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కే.రహేజా గ్రూపునకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ - మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రూ.3,375 కోట్ల సమీకరణ కోసం ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) చేస్తోంది. దీనికి అదనంగా ఇప్పటికే రూ.1518 కోట్లను యాంకర్ ఇన్వెస్టర్స్‌ నుంచి సమీకరించారు. ఇష్యూ ద్వారా సమీకరించే రూ.4,500 కోట్లకు పైగా మొత్తాన్ని ఈ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (REIT)కి ఉన్న రుణభారంలో కొంత తగ్గించుకునేందుకు వినియోగిస్తారు. గత ఏడాది, అంటే మార్చి 2019లో ఐపీఓకు వచ్చిన ఎంబసీ ఆఫీస్‌ పార్క్‌ REIT తరువాత వస్తున్న రెండవ REIT ఐపీఓ ఇది.

వ్యాపారం..
ప్రస్తుతం మైండ్‌ స్పేస్‌ REIT ఐదు ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్క్స్‌ను ముంబై, పూణె, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో నిర్వహిస్తోంది. మొత్తం 29.5 మిలియన్‌ చదరపు అడుగుల లీజుకు ఇవ్వదగిన స్థలం ఈ సంస్థ సొంతం. 

ప్రస్తుతం 170 క్లయింట్లతో 92 శాతం స్థలాన్ని వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చి ఆదాయం ఆర్జిస్తోంది. సంస్థ క్లయింట్ల జాబితాలో ఫేస్‌బుక్‌, క్వాల్‌కామ్‌, యూబీఎస్‌, బార్ల్కేస్‌ తదితర ఎంఎన్‌సీ సంస్థలు ఎన్నో ఉండటం విశేషం. సంస్థకు లీజ్‌ రెంటల్స్‌ ద్వారా 68శాతం ఆదాయం సమకూరుతూ ఉంటే, ఫెసిలిటీ మెయిన్‌టెనెన్స్‌ ద్వారా 16 శాతం, కాంట్రాక్ట్‌ వర్క్స్‌ ద్వారా 12శాతం, మిగతాది పవర్‌ సప్లయ్‌ ద్వారా లభిస్తోంది.

గత ఏడాది మైండ్‌ స్పేస్‌ రీట్‌ రూ.1200 కోట్ల లీజు ఆదాయాన్ని, రూ.1766 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. దీనిపై రూ.1372 కోట్ల నిర్వహణ లాభాన్ని, రూ.475 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. గత ఏడాదిలో కోవిడ్‌ ప్రభావం కొంత ఉన్నప్పటికీ, 99.4శాతం గ్రాస్‌ కాంట్రాక్టెడ్‌ రెంటల్స్‌ని వసూలు చేయగలగడం గమనార్హం. ప్రస్తుతం సంస్థ ముంబై, పూణె, హైదరాబాద్‌ నగరాల్లో మరొక 2.8 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను నిర్మించి తన కార్యకలాపాలు విస్తరిస్తోంది.

షేర్‌ హోల్డర్లకేంటి?
మైండ్‌స్పేస్‌ యూనిట్లను పోర్ట్‌ఫోలియో నెట్‌ అసెట్‌ వేల్యూపై డిస్కౌంట్‌కి ఆఫర్‌ చేస్తూ ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్‌హోల్డర్లకు సుమారుగా 7శాతం డిస్ట్రిబ్యూషన్‌(డివిడెండ్‌) ఈల్డ్‌ లభించనుంది. ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌తో పోల్చితే ఇది కొంత తక్కువే. ఎందుకంటే ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఆఫర్‌ ధర రూ.300 కాగా, యూనిట్‌ ఒక్కింటికి రూ.24.39 డివిడెండ్‌ని పంచిపెట్టింది. మైండ్‌స్పేస్‌ మాత్రం రూ.275 యూనిట్‌ ధరపై రూ.19.39 లాభాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసింది. అయితే కొంత లిస్టింగ్‌ గెయిన్స్‌ కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిక్స్‌డ్‌ ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్లకు అనువైన ఇష్యూ ఇది. కోవిడ్‌ కలకలం ముగిసిన తరువాత రెంటల్‌ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి రెండేళ్ళు, ఆపై కాలవ్యవధి కోసం ఓపిక పట్టేవారికి అనుకూలం. tv5awards