లాభాల్లో గ్రోఫర్స్.. వచ్చే ఏడాదే IPO

లాభాల్లో గ్రోఫర్స్.. వచ్చే ఏడాదే IPO

లాభాల్లో గ్రోఫర్స్.. వచ్చే ఏడాదే IPO

లాక్ డౌన్ లో పెరిగిన లాభాలు
పెరుగుతున్న కొత్త కస్టమర్లు
6వేల కోట్లకు పెరిగిన కంపెనీ వాల్యూ

ఈ కామర్స్ సంస్థ గ్రోఫర్స్ వచ్చే ఏడాది ఇన్సియల్ పబ్లిక్ ఆఫర్-IPOకు సిద్దం చేసుకుంటోంది. లాక్ డౌన్ కంపెనీకి వరంగా మారింది. బిజినెస్ పెరగడంతో పాటు.. ఫ్యూచర్ లో మంచి లాభాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది సంస్థ.  ఈ ఏడాది జనవరి నుంచి  ఆపరేషనల్ ప్రాఫిట్ సాధించిన కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి క్యాష్ పాజిటివ్ కు చేరుకుంటుందని కంపెనీ కో ఫౌండర్ అల్బిందర్ థిండ్సా ప్రకటించారు. జూన్ లో కంపెనీ 4.4 కోట్ల ఉత్పత్తులను కస్టమర్లను అందించింది. 42లక్షల కుటుంబాలకు సరుకులు సరఫరా చేసింది. కోవిడ్ కంటే ముందు జరిగిన వ్యాపారంతో పోల్చితే 30శాతం పెరిగినట్టు కంపెనీ తెలిపింది. కొత్త కొత్త నగరాలకు సర్వీసులను విస్తరిస్తోంది. తాజాగా లక్నో, బివాండీలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం గ్రోఫర్స్  10వేల స్టోర్స్ తో ఒప్పందం చేసుకుంది. గడిచిన రెండు నెలల్లో 3వేల మందిని హైర్ చేసుకుంది. మరో 2వేల మందిని తీసుకునేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ ను పరిశీలిస్తున్నాం.. అన్ని అనుకూలంగా ఉంటే.. వచ్చే ఏడాది చివరినాటికే IPOకు వస్తామంటోంది. అంతకుముందు 2022లో రావాలని భావించింది. కానీ బిజినెస్ పెరగడంతో పాటు... ప్రాఫిట్ ఉండటంతో ముందుగానే వచ్చేందుకు సిద్దమవుతోంది. కంపెనీ ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి 2500 కోట్ల  ఆదాయం చూపించింది. మొత్తం కంపెనీ విలువ 6వేల కోట్లు ఉంటుందని అంచనా. గ్రోఫర్స్ లో ఇప్పటికే సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు పెట్టింది.tv5awards