జీవనశైలే కాదు.. ప్రపంచమే మారిపోతుంది: ఉదయ్ కోటక్ అంతరంగం

జీవనశైలే కాదు.. ప్రపంచమే మారిపోతుంది: ఉదయ్ కోటక్ అంతరంగం

ఇండియా ఇంక్.. అండ్ కరోనా ఎఫెక్ట్

జీవనశైలే కాదు.. ప్రపంచమే మారిపోతుంది
ఆకళింపు చేసుకుంటే అధ్బుతాలే
గమ్యం కనపడుతోంది.. సిద్దమవ్వాలి
లక్ష్యం ఉంటే.. ఫలితం వస్తుంది
షేర్ మార్కెట్లపై కోవిడ్  ప్రభావం తక్కువే
కోటక్ మహీంద్రా అధినేత ఉదయ్ కోటక్ అంతరంగం


60 ఏళ్లలో ఎప్పడూ ఇలాంటి విపత్తు చూడలేదు. చూస్తానని కూడాఅనుకోలేదు. దీని వెనక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. 1959లో పుట్టిన నేను నా చిన్నవయసులో మా అమ్మమ్మ, తాతయ్య వద్ద ఎక్కువగా పెరిగాను. మాతాత ఎప్పుడూ మాచిపోయిన వైట్ కలర్ కుర్తా వేసుకునేవాడు. అమ్మమ్మను అడిగితే మీరు లక్కి.. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు మేం ఎదుర్కొన్నాం. మీకు డబ్బు విలువ తెలియడం లేదని చెప్పేది. కారణం వాళ్ల జనరేషన్ స్పానిష్ ఫ్లూ చూసింది. గ్రేట్ రెసిషన్ ఫేస్ చేసింది. తర్వాత తర్వాత నాకు అర్ధమైంది. కానీ సరిగ్గా అలాంటి పరిస్థితి నాకు ఈ వయసులో అనుభవంలోకి వచ్చింది. కోవిడ్ 19, దీని వల్ల వస్తున్న ఆర్థిక సంక్షోభం. ప్రపంచానికి సరికొత్త సవాళ్లు విసురుతోంది. నేను నా జీవితకాలంలో  వేగంగా పేదరికం తగ్గడాన్ని చూశాను. అడ్వాన్స్ డ్  టెక్నాలజీ, గ్లోబలైజేషన్ చూశాం.. ఇప్పుడు కరోనా పేండమిక్ చూస్తున్నాం. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఏ స్థాయిలో పతనం చేస్తుందో గమనిస్తున్నాం. 

ఇండియా మాక్రో ఎకనామిక్ అవుట్ లుక్

మెజార్టీ ఎకనామిస్టులు అంతా నెగిటీవ్ గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 7 నుంచి 5శాతం వరకూ తగ్గుతుందని అంచనాలు ఇస్తున్నారు. 2013 నాటి క్రైసిస్ కంటే దారుణంగా ఉండదన్నది మాత్రం ఊరటనిస్తోంది. మూడీస్, ఫిచ్, S&P వంటి సంస్థలు ఇండియా రేటింగ్ డౌన్ గ్రేడ్ చేస్తున్నాయి. కానీ దీనిపై అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది నాకు. దేశీయంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి. పైగా ఈ సంక్షోభం ఇండియాకు సరికొత్త అవకాశాలను తీసుకొస్తోంది. ఎడ్యుకేషన్, మ్యానుఫాక్చరింగ్, హెల్త్ కేర్ రంగాల్లో ఇన్వెస్టమెంట్లు ఇండియా భవిష్యత్తుకు పట్టుగొమ్మలుగా మారనున్నాయి. 

అందుకే మార్కెట్లు అలా...

నాకు తెలుసు చాలామందిలో పెద్ద డౌట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్లోడౌన్ ఉన్నా.. మార్కెట్లు మెరుగ్గా ఉండటానికి కారణాలేంటని? అవును ఇది నిజమే. స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. చాలాదేశాలు మానిటరీ సపోర్ట్ ఇస్తున్నాయి. పారిశ్రామిక, వ్యాపారవర్గాలను ఆదుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇక ఇన్వెస్టర్లు కూడా ఇప్పటికిప్పుడు లాభాలు ఆశించడం లేదు.. 2022, 23లో వచ్చే లాభాలను చూస్తున్నారు. వారిలో ధీమానే మార్కెట్లకు ఇన్వెస్టమెంట్ రూపంలో వస్తోంది. అందుకే మార్కెట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లోకి నిధులు వస్తున్నాయి.

బ్యాంకింగ్ రంగానికి ఉద్దీపన ఇవ్వాలి

ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ రీకాపిటలైజేషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకింగ్ లోన్ బుక్ 100 లక్షల కోట్లుగా ఉంది. కానీ మొత్తం బ్యాంకింగ్ కేపిటలైజేషన్ మాత్రం కేవలం 11 నుంచి 12లక్షల కోట్లు మాత్రమే. అంటే కోవిడ్ కారణంగా 4 నుంచి 5శాతం బ్యాడ్ డ్యూస్ వచ్చినా సెక్టార్ 40శాతం ఎఫెక్ట్ అవుతుంది. సో.. బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం కోవిడ్ క్రైసిస్ టెన్షన్ ఉంది. ఫైనాన్షియల్ సెక్టార్ సంక్షోభంలో పడకుండా చూడాల్సిన అవసరం బలంగా ఉంది. 

సరికొత్త పరిణామం వైపు..

ఓ కొత్త మార్పు వైపు ప్రపంచ అడుగుపెడుతోంది. వర్క్ ఫ్రం హోం కల్చర్ వస్తోంది. అర్బన్ నుంచి రూరల్ కు మైగ్రేషన్ వరకూ సరికొత్త అవకాశాలను చూపిస్తున్నాయి. మొత్తం జీవనశైలి మారుతుంది. పనివిధానం ఛేంజ్ అయింది. అలవాట్లు, అభిరుచులు మారుతున్నాయి. మరోసారి డార్విన్ మానవ పరిణామ సిద్దాంతం అనుభవంలోకి వచ్చింది. దీనిని ఎంత త్వరగా ఆకళింపు చేసుకుని అడుగులు వేస్తే.. అంతటి అధ్బుత ఫలితాలు కనిపిస్తాయి. ఇంతకాలం బ్యాక్ ఆఫీస్ గా సేవలు అందించిన దేశం.. ఉత్పత్తి రంగంలోనూ ఫ్రంట్ ఉండే సమయం ఆసన్నమైంది.

బిజినెస్ లోనూ గేమ్ ప్లాన్ 
క్లిష్టమైన పరిస్థితుల్లో బిజినెస్ రన్నింగ్ చేయాలంటే ఖచ్చితంగా గేమ్ ప్లాన్ ఉండాలి. కాస్ట్ అండ్ ప్రొడెక్టవిటిపై ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. లెండింగ్ విషయంలో బిఫోర్ కొవిడ్(BC), ఆఫ్టర్ కొవిడ్ (AC)అని నిర్వచించుకుని మరీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. లెండింగ్ విషయంలో ఫిల్టర్ చేయాలి. కంఫర్ట్ సెక్టార్ గుర్తించాలి. ఫిక్స్ డ్ ఆపరేటింగ్ కాస్ట్ అండ్ ఇండివిడ్యువల్ కంపెనీస్ గురించి తెలుసుకోవాలి. పనిలో మన మెదడు మరింత వేగంగా పనిచేయాలి. అవకాశాలను గుర్తించాలి. ఫైనల్ గా నాన్ క్రెడిట్ రిస్క్ ఏరియాస్ చూసుకుని బిజినెస్ పెంచుకోవాలి. ఉదాహరణకు అడ్వైజరీ, సెక్యూరిటీస్, వెల్త్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ వంటివి. 

కోటక్ సూపర్ హిట్..

ఇప్పటివరకూ మనం అధ్బుత విజయాలనే నమోదుచేశాం. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్ నడి సముద్రంలో చిక్కకుపోయిన నావలా మారింది. తుఫాను గాలులను తట్టుకుని పడవను జాగ్రత్తగా తీరం చేర్చాలి. అయితే మన కంపెనీ సాఫీగానే సాగుతుంది. బ్యాలెన్స్ షీట్ QIP ఇష్యూ మే 2020లో రూ.7400 కోట్లు సొ.. ఇదో శుభశకునం. సేవింగ్ డిపాజిట్లు కూడా సంస్థకు ఎసెట్  అవుతున్నాయి. గత ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి లక్ష కోట్లు దాటాయి. ప్రతి ఏటా 21 శాతం గ్రోత్ రేట్ కనిపిస్తోంది. 2020 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి 44లక్షల మంది 811 బ్యాంక్ ఖాతాలు తెరిచారు. రూ.2.2 లక్షల కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చాం. 7శాతం గ్రోత్ రేటు రిపోర్ట్ అయింది.

సో... ప్రపంచ మారుతుంది. మనం మార్పును ఆహ్వానించాలి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటే విజయం మీదే.. మీ విజయానికి ఎవరూ అడ్డుకాదు.
--మీ ఉదయ్ కోటక్

Source: ఉదయ్ కోటక్ త్రైమాసిక నివేదిక