IPOకు మైండ్ స్సేస్ బిజినెస్ పార్క్స్ REIT

IPOకు మైండ్ స్సేస్ బిజినెస్ పార్క్స్ REIT

మైండ్ స్సేస్ బిజినెస్ పార్క్స్ REIT ఐపీవో

జులై27న IPOకి కంపెనీ
టార్గెట్ రూ.4500 కోట్లు
యూనిట్ ప్రైస్ రూ.274-275

రియల్ ఎస్టేట్ ఇన్వెస్టమెంట్ ట్రస్ట్ (REIT) విభాగంలో రెండో కంపెనీ ఐపీవో కు వస్తోంది. ఇప్పటికే ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థ ఏప్రిల్ 2019లో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కు  వచ్చింది. ఇప్పుడు మైండ్ స్పేస్ బిజినెస్ పార్స్క్ కూడా సిద్దమైంది. జులై 27న IPO ఓపెన్ చేస్తోంది. సుమారు 4700 కోట్లు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కె.రహేజా కార్పొరేషన్, బ్లాక్ స్టోన్ గ్రూప్ భాగస్వామ్య కంపెనీ ఇది. ఐపీఓకి ముందే కంపెనీలో రూ.1125 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. ఇందులో సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉంది. దీంతో పాటు... కేపిటల్ గ్రూప్, ఫులర్టన్ ఇండియా ఉన్నాయి. ఆయా సంస్థలు మొత్తం IPOలో 25శాతం వాటా దక్కించుకుంటున్నాయి.  

స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ కు 4.09 లక్షల షేర్లు ఇచ్చేందుకు కంపెనీ సిద్దమైంది. ఒక్కో యూనిట్ ధర 275 రూపాయలుగా నిర్ణయించింది. సెబీకి ఇచ్చిన సమాచారంలో ఈ వివరాలు అధికారికంగా ప్రకటించింది సంస్థ. రహేజా సంస్థకు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ విభాగంలో మెరుగైన వాటా ఉంది. 29.5 మిలియన్ చదరపు అడుగుల కమర్శియల్ స్పేస్ ఉంది. ముంబై, హైదరాబాద్, పూనె, చెన్నైలో దీనికి కంపెనీకి ఆఫీస్ స్పేస్ ఉంది. కంపెనీ మంచి లాభాల్లో కూడా ఉంది. 2019 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే  2020లో లాభాల్లో 21శాతం వ్రుద్ధిరేటు సాధించింది.

రూ.23వేల 675 కోట్లు విలువైన కంపెనీ రహేజా. రహేజాకు చెందిన ఆఫీస్ స్పేస్ లో 92శాతం ఆక్యుపెన్సీ ,రేటు ఉంది.. అంతేకాదు..చదరపు అడుగుకి 52.5 రూపాయల రెంట్ వసూలు చేస్తోంది. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ గా మార్కెట్లో ఉంది రహేజా. సొ.. కంపెనీ ప్రొఫైల్ చూస్తే.. ఇన్వెస్టర్ల నుంచి భారీగానే డిమాండ్ వచ్చేలా ఉంది.   మరి ఎన్ని రెట్లు సబ్ స్క్రైబ్ అవుతుందో చూడాలి.



tv5awards