హైదరాబాద్‌లో కస్టమ్‌ ఫర్నిష్‌ తొలి స్టోర్‌ 

హైదరాబాద్‌లో కస్టమ్‌ ఫర్నిష్‌ తొలి స్టోర్‌ 

గృహావసరాల కోసం ఆన్ లైన్‌లో కస్టమైజ్డ్ ఫర్నీచర్ అందిస్తోన్న కస్టమ్‌ ఫర్నిష్‌ డాట్‌ కామ్ తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్ కొండాపూర్ లో ప్రారంభించింది. ఆన్ లైన్‌లో కొనుగోలు చేయాలనుకొనే కస్టమర్లకు లుక్ అండ్ ఫీల్ అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ స్టోర్‌ను లాంఛ్ చేసినట్లు కస్టమ్ ఫర్నిష్ ఫౌండర్ మధుకర్ గంగాడి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా దేశవ్యాప్తంగా 30 స్టోర్లు ప్లాన్ చేస్తున్నామని, హైదరాబాద్‌లో మరో 5 స్టోర్లు ..బెంగళూరు , చెన్నై, నాగ్‌పూర్, పూణేలలో మొత్తం 25 స్టోర్లు ప్రారంభించనున్నామని ఆయన అన్నారు.  ఈ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్‌లో సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్స్‌తో పాటు అన్నిరకాల ఫర్నిచర్ ఉత్పత్తులను షో కేస్ చేయనున్నట్లు మధుకర్ అంటున్నారు. ఒక్కో స్టోర్ వెయ్యి నుంచి 3 వేల 500 చదరపు అడుగులలో ఉండేట్లు ప్లాన్ చేస్తున్నామని ఇందుకోసం ఏరియాను బట్టి ఒక్కో స్టోర్ కోసం 30 నుంచి 50 లక్షల రూపాయల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.Most Popular