స్టాక్స్ ఇన్ న్యూస్ (26, జూన్ 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (26, జూన్ 2020)
  • టూరిజం ఫైనాన్స్‌: కంపెనీలో 1.3శాతం వాటా కొనుగోలు చేసిన ఐసీఎం ఫైనాన్స్‌
  • టూరిజం ఫైనాన్స్‌: ఒక్కో షేరు రూ.35.5 చొప్పున మొత్తం 10.50 లక్షల షేర్లను కొనుగోలు చేసిన ఐసీఎం ఫైనాన్స్‌
  • వేదాంత : 93.34 శాతం ఓట్లతో డీ లిస్టింగ్‌కు ఆమోదం తెలిపిన కంపెనీ వాటాదారులు
  • అపోలో టైర్స్‌ : చిత్తూరు జిల్లాలోని ప్లాంట్‌ను డెవలప్‌ చేసేందుకు తొలి దశలో రూ.3800 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్న కంపెనీ
  • అరబిందో ఫార్మా : యూఎస్‌, ఈయూ మార్కెట్లలో పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఉత్పత్తులను పెంచనున్న కంపెనీ
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా : మొండిబకాయిలు పెరగడంతో క్యూ-4లో రూ.3571 కోట్ల నష్టాన్ని ప్రకటించిన బ్యాంక్‌
  • ఐడీబీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ : తమ జేవీలో ఐడీబీఐ బ్యాంక్‌ వాటాను మరో 4శాతం కొనుగోలు చేసిన ఫెడరల్‌ బ్యాంక్‌, విలువ రూ.80 కోట్లు
  • ఐఓబీ : మొండి బకాయిలు తగ్గడంతో క్యూ-4లో రూ.143.79 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం