30 నెలల గరిష్టానికి ర్యాలీస్‌ ఇండియా

30 నెలల గరిష్టానికి ర్యాలీస్‌ ఇండియా

వరుసగా రెండో రోజూ ర్యాలీస్‌ ఇండియాలో ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ ఇంట్రాడేలో 5శాతం లాభపడి రూ.275కు చేరింది. ఇది 2018 జనవరి గరిష్ట స్థాయి కావడం విశేషం. గత 7 సెషన్స్‌లో ఈ స్టాక్స్‌ 5 రోజులు లాభాల్లోనే ట్రేడైంది. మొత్తం 7 సెషన్‌లో ర్యాలీస్‌ ఇండియా 9శాతం లాభపడింది. ప్రస్తుతం మూడున్నర శాతం లాభంతో రూ.271.05 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.

వాల్యూమ్స్‌ విషయానికి వస్తే 30 రోజుల సగటుతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. ఈ ఏడాది మార్చి 24న 52 వారాల కనిష్టాని(రూ.125)కి పడిపోయిన ఈ స్టాక్‌ ప్రస్తుతం ఆ స్థాయి నుంచి దాదాపు రెట్టింపు లాభపడింది.

ఇక ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5254.55 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 40.86 కాగా, కంపెనీ పీ/ఈ 40.81గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.72.51, ఈపీఎస్‌ రూ.6.63గా ఉంది.