రికార్డ్‌ స్థాయి గరిష్టానికి ఎస్కార్ట్స్‌

రికార్డ్‌ స్థాయి గరిష్టానికి ఎస్కార్ట్స్‌

2 రోజుల వరుస నష్టాలకు ఎస్కార్ట్‌లో ఇవాళ బ్రేక్‌ పడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో టాప్‌ పెర్ఫామర్‌గా కొనసాగుతోంది ఎస్కార్ట్స్‌. ఇవాళ ఇంట్రాడేలో 8శాతం లాభపడి రూ.1048కి చేరి ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకింది. గత రెండు నెలల్లో సింగిల్‌డేలో ఈ స్టాక్‌లో ఇదే అతిపెద్ద జంప్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఎస్కార్ట్స్‌ 6శాతం పైగా లాభంతో రూ.1029.20 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.

ఇక వాల్యూమ్స్‌ విషయానికి వస్తే ఇవాళ మెరుగ్గా ఉన్నాయి. 30 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌లో 2.3 రెట్ల వృద్ధి నమోదైంది. గత ఏడాది ఆగస్ట్‌ 23న 52వారాల కనిష్టానికి పడిపోయిన ఈ స్టాక్‌... ప్రస్తుతం మూడు రెట్లు పెరిగింది. 

కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయానికి వస్తే రూ.12,502.84 కోట్లుగా నమోదైంది. ఇండస్ట్రీ పీ/ఈ 28.65 కాగా, కంపెనీ పీ/ఈ 25.75గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.283.91, ఈపీఎస్‌ రూ.39.61గా ఉంది.